సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ప్రథమం
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:05 AM
దేశంలో సంక్షేమ పథకాల కు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోని కూట మి ప్రభుత్వమేనని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు, జూలై 27(ఆంధ్రజ్యోతి):దేశంలో సంక్షేమ పథకాల కు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోని కూట మి ప్రభుత్వమేనని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పై డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని నూజివీడు మండలం తుక్కు లూరు అడవి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజా కార్య క్రమాలు నిర్వహించి మంత్రి ప్రారంభించారు. నూజివీడు 8వ వార్డులో డోర్ టూ డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను టిడ్కో భవనాలపై స్థానిక మహిళలు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ గత ప్రభుత్వంలో టిడ్కో లబ్ధిదారుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నారని, కనీసం ఒక్క ఇంటిని కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని, దీనిపై వైసీపీ నాయకులను ప్రశ్నించాల న్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే టిడ్కో భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. తాగునీటి సమస్య, పింఛన్లు, తల్లికి వందనం నిధులు జమ కాకపోవడం తదితర సమస్యలను మహిళలు మంత్రికి విన్నవించారు. కమిషనర్ పీరయ్య, మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మాజీ ప్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మలిశెట్టి జగదీష్, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.