పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - May 17 , 2026 | 12:55 AM
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థ సారథి హెచ్చరించారు.
మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడులో స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణ ఆంధ్ర
నూజివీడు, మే 16(ఆంధ్రజ్యోతి):పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థ సారథి హెచ్చరించారు. స్థానిక బాపునగర్‌లో స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనగా స్థానికులు పారిశుధ్యం, డ్రెయినేజీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో డ్రెయినేజీలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ నూజివీడులో ఎక్కడా అపరిశుభ్ర పరిస్థితు లు కనపడకూడదని, డ్రెయిన్లలో పూడిక తీసి మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు ఉదయాన్నే పట్టణంలో పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలిం చాలన్నారు. పారిశుధ్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటా నని మంత్రి అధికారులను హెచ్చరించారు. సబ్‌కలెక్టర్ వినూత్న, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ప్లోర్ లీడర్ చెరుకూరి దుర్గప్రసాద్, మున్సిపల్ కమిషనర్ పీరయ్య, కూటమి నేతలు పాల్గొన్నారు.