నిధుల కొరత లేదు..
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:55 PM
అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా భావిస్తూ నిధుల కొరత లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
మంత్రి పార్థసారథి
నూజివీడు/ఆగిరిపల్లి, మార్చి 25 (ఆంధ్ర జ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా భావిస్తూ నిధుల కొరత లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆగిరిపల్లి మండలంలో బుధవారం వివిధ గ్రామాల్లో రూ.7.67 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మంత్రి చేశారు. శోభనాపురంలో మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కుంటుపడిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందన్నారు. అయా గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. వివిధ శాఖల అధికారులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని మంత్రి కొలుసు పార్థసారథి ఉపాధ్యాయులకు సూచించారు. ఈదర పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యతలో ఎక్కడైనా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. హెచ్‌ఎం శారద, విద్యా కమిటీ చైర్మన్ కంచిర్ల అంజయ్య, పాల్గొన్నారు.