చట్ట సభలలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు : మంత్రి కొలుసు
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:46 AM
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి స్పష్టం చేశారు.
నూజివీడు, మార్చి 8(ఆంధ్రజ్యోతి) : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి స్పష్టం చేశారు. నూజివీడులో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మహిళల సాధికారత, అర్థికాభివృద్ధికి కూటమి ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్య క్రమాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో లక్షల మంది మహిళల ను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని ఆయన వివరించారు. జేసీ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. 286 స్వయం సంఘాలకు రూ.36 కోట్లు రుణాలను, నూజివీడులో 31 మంది బాధిత కుటుంబాలకు 15 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. వివిధ రంగాలలో సేవలందించిన మహిళలను మంత్రి సన్మానించారు. పురపాలక సంఘం చైర్‌పర్సన్ రామశక్తి త్రివేణిదుర్గ, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయ కులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.