Share News

ఉపాధి కూలీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:18 AM

చింతపర్రు గ్రామంలో 50రోజుల పాటు వేసవి మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు మంత్రి రామానాయుడు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా ఆయనే వడ్డించారు.

ఉపాధి కూలీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
చింతపర్రులో ఉపాధి కూలీలకు భోజనం వడ్డిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు రూరల్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ఉపాధి కూలీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం మండలంలోని చింతపర్రు గ్రామంలో 50రోజుల పాటు వేసవి మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు మంత్రి రామానాయుడు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా ఆయనే వడ్డించారు. కూలీ ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి తాపం లేకుండా పార్టీ శ్రేణు లతో మజ్జిగను పంపిణీ చేశానన్నారు. లక్కీ డ్రా ద్వారా మహిళా కూలీలకు చీరలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పి.రజనీకుమార్‌, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పెన్మెత్స శ్రీనురాజు, అందే కోటివీరభద్రం, ఎల్లపు లోకేష్‌, వీరమల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 01:18 AM