Share News

ఆక్వా రంగానికి నిరంతర విద్యుత్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:49 AM

ఆక్వా రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

ఆక్వా రంగానికి నిరంతర విద్యుత్‌
గోపవరంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గొట్టిపాటి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

జోన్లతో సంబంధం లేకుండా సబ్సిడీ..

ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

గోపవరంలో 220/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

కైకలూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి):ఆక్వా రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గోపవరంలో రూ.55కోట్లతో నిర్మాణం చేసిన 220/33 కేవీ నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సోమ వారం డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, విద్యుత్‌శాఖ సీఎండీ పి.పుల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘ఆక్వా రంగానికి 24 గంటలు రాయితీపై నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తాం. పీక్‌ అవర్స్‌లో అవసరమైతే తక్కువ ధరకే బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి ఆక్వాకు అందిస్తాం. ఆక్వారంగానికి రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. రాయితీపై ఈ విద్యుత్‌ను అందించడం వల్ల రూ.1200 కోట్లు ఖర్చు అవుతోంది. ఆక్వా, నాన్‌ఆక్వా జోన్‌ లతో సంబంధం లేకుండా రాయితీపై విద్యుత్‌ అందిస్తు న్నాం. ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో కంటే ఎక్కువ విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. అందుకు తగినట్లుగా విద్యుత్‌ ఉత్పత్తి పెంచాం. నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్రంలో రూ.6వేల కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెల లకు విద్యుత్‌ చార్జీలు పెంచారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతు’ న్నామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గ అభివృద్ధిలో, నూతన సబ్‌స్టేషన్‌ నిర్మాణంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో కైకలూరు ప్రాంతం లోని ప్రజలకు, రైతులకు మరో 15 ఏళ్ల పాటు కరెంటు కష్టాలు ఉండవన్నారు. నియోజకవర్గంలో మరో ఐదుచోట్ల సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, చిగురుకోటలోని సబ్‌స్టేషన్‌ను 220/33 కేవీ స్థాయికి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కలిదిండి పర్యటనలో 15 వేలకు పైగా ప్రజలు హాజరైతే 500 మంది కూడా లేరని వైసీపీ నాయకులు దుష్ర్పాచారాలు చేస్తున్నా రన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయడమే నాకు తెలుసని వారి మాట్లాడే మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తు న్నామన్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ కొత్త నాగేంద్రకుమార్‌, జేసీ అభిషేక్‌ గౌడ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, విద్యుత్‌శాఖ డైరెక్టర్లు ఎ.మురళీకృష్ణయాదవ్‌, ఏకేవీ భాస్కరరావు, విద్యుత్‌ ఎస్‌ఈ పి.హరిబాబు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, రాష్ట్ర చేపల రైతు సంఘం అధ్యక్షుడు తాడినాడ బాబు, ఏఎంసీ చైర్మన్లు పెన్మెత్స త్రినాథరాజు, కురేళ్ళ ఏడుకొండలు, టీడీపీ కోకన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:49 AM