తెలుగుదేశం జిల్లా సంబరం
ABN , Publish Date - May 14 , 2026 | 12:34 AM
తెలుగుదేశం జిల్లా సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.నెల్లూరులో నిర్వహించే మహానాడుకు సమాయత్తమయ్యేలా జిల్లాలో నియోకవర్గ, జిల్లా మినీ మహానాడులు ఏర్పాటు చేయనున్నారు.
హాజరు కానున్న ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి, జోనల్ ఇన్‌చార్జి ప్రత్తిపాటి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం జిల్లా సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.నెల్లూరులో నిర్వహించే మహానాడుకు సమాయత్తమయ్యేలా జిల్లాలో నియోకవర్గ, జిల్లా మినీ మహానాడులు ఏర్పాటు చేయనున్నారు. నియోజక వర్గాల్లో ఇప్పటికే మహానాడు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే జిల్లా మినీ మహానాడు కూడా ఖరారైంది. ఈ ఏడాది తాడేపల్లిగూడెం వేదికగా జిల్లా మహానాడు నిర్వహించేందుకు నిర్ణయించారు. జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సూచన మేరకు తాడేపల్లిగూడెంలో ఈ నెల 22న మినీ మహానాడు సంబరాలకు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి ఆతిథ్యం ఇస్తున్నారు. మినీ మహానాడుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జోనల్ ఇన్‌ఛార్జి ప్రత్తిపాటి పుల్లారావులు హాజరవుతున్నారు. జిల్లా నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, షరీఫ్‌లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇన్‌ఛార్జ్‌లు తోట సీతా రామలక్ష్మి, పొత్తూరి రామ రాజులు హాజరు కానున్నారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు మినీ మహా నాడులో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెం మాగంటి కల్యాణ మండపంలో మహానాడు కార్యక్రమం ఏర్పాటుకు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది తణుకులో నిర్వహిం చారు. ఈసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ సమావేశంలోనే జిల్లా ప్రగతిపై తీర్మానాలు చేయ నున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కూటమిలో మంచి జోష్ ఏర్పడింది. జిల్లా నాయకులంతా ఒకే వేదికపై మరోసారి కలవనున్నారు. గతంలో జిల్లా సమావేశాన్ని తాడేపల్లిగూడెం మాగంటి కల్యాణ మండపంలోనే నిర్వహించగా ఆ కార్యక్రమం విజయవంతమైంది. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం అధిష్ఠానం జిల్లాకు ప్రాధాన్యం ఇస్తోంది. మహనాడు కమిటీల్లోనూ జిల్లా నేతలకు భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర., జాతీయ కమిటీ ల్లోనూ మంచి హోదాల్లోనే నియ మించారు. అదే జోష్ జిల్లా మినీ మహానాడులో కనిపించాలని నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. జిల్లా నుంచి నెల్లూరులో నిర్వహించే రాష్ట్ర మహా నాడుకు పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.