ప్రభుత్వ భూమిని మింగేశారు..!
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:38 AM
ఏలూరు రూరల్ మండలం కోమటిలంక పరిధిలో కొల్లేరు కాంటూరు, బిలో కాంటూరు ప్రాంతాల్లో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురై చేపల, రొయ్యల చెరువులుగా మారిపోయాయి.
కొల్లేరులో నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు
పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖ
అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్
కలెక్టర్‌కు జనసేన నాయకుల ఫిర్యాదు
ఏలూరు రూరల్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఏలూరు రూరల్ మండలం కోమటిలంక పరిధిలో కొల్లేరు కాంటూరు, బిలో కాంటూరు ప్రాంతాల్లో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురై చేపల, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో చెరువులు తవ్వి కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నప్పటికీ రెవెన్యూ, అటవీ, సంబంధిత శాఖలు చూసీ చూడ నట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చెరువులకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సర ఫరా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణ జర గడంలో కొందరు అధికారులు, స్థానిక ప్రజా ప్రతి నిధుల పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో ఈ తంతు గుట్టుచప్పుడు కాకుం డా జరగ్గా ఇప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహ రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సోమవారం పీజీఆర్ ఎస్‌లో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతపూడి చందు, మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ ఛైర్మన్ మోరు వెంకట నాగరాజు, ఏలూరు రూరల్ మండల నాయకుడు భలే లక్ష్మణరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహిం చాలని ఆమె ఆదేశించారు.