మెగా సక్సెస్
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:25 AM
పాఠ శాల–కుటుంబ సంబంధాల ను బలోపేతం చేయడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు (మెగా పీటీఎం 4.0) విజయవంతమ య్యాయి.
జిల్లాలో పండుగలా పీటీఎం
పాఠశాలలకు తరలివచ్చిన తల్లిదండ్రులు
ఏలూరు అర్బన్/పెదపాడు/నూజివీడు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పాఠ శాల–కుటుంబ సంబంధాల ను బలోపేతం చేయడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు (మెగా పీటీఎం 4.0) విజయవంతమ య్యాయి. 1,748 పాఠశాలలు, 20 జూనియర్ కళా శాలల్లో ఉదయం నుంచే పండుగ వాతావరణంలో మెగా పీటీఎంను నిర్వహించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, హెచ్ ఎంలు/ప్రిన్సిపాళ్లు వారికి ఆహ్వానం పలికారు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం విద్యా ర్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను తల్లిదండ్రులకు అందజే యడం, బాల బాలికల అభ్యసన ప్రగతిపై చర్చించ డం, తల్లికి వందనం లబ్ధిదారులతో మాట్లాడించడం, స్కూలు సమస్యలను తెలపడం వంటివి విజయ వం తమయ్యాయని సమగ్ర శిక్ష సీఎంవో యెహోషువా తెలిపారు. పలువురు దాతలు, పూర్వ విద్యార్థులు పాఠశాలల్లో మౌలిక వసతుల నిమిత్తం విరాళాలను ప్రకటించారు. మెగా పీటీఎం 4.0కి హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించినట్టు సీఎంవో వివరించారు.
పీటీఎంతో విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధి
విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం) ఎంతగానో దోహదపడుతుందని కలె క్టర్ వెట్రిసెల్వి తెలిపారు. పెదపాడు జడ్పీ హైస్కూల్ లో శుక్రవారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 1,772 ప్రభుత్వ పాఠశాలలు, 20 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతా వరణంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 2,56,393 విద్యార్థులకు సంబంధించి 1,65,722 తల్లు ల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసిందన్నారు.అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సత్కరించారు. కూటమి నాయ కులతో కలిసి మొక్క నాటారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. సొసైటీ అధ్యక్షుడు గారపాటి స్టాలిన్, పెదపాడు డీసీ చైర్మన్ కాశీబాబు, క్లస్టర్ ఇన్‌చార్జి అనిల్, పార్టీ అధ్యక్షులు రవి, వంశీకృష్ణ, ఎంఈవో నరసింహామూర్తి, హెచ్ ఎం విజయ తదితరులు పాల్గొన్నారు.
లోటుపాట్లను సమీక్షకు పీటీఎం దోహదం : మంత్రి సారథి
విద్యార్థులు విద్యలో వెనుకబాటుతనానికి కారణా లు, లోటు పాట్లను సమీక్షించి సరిదిద్దుకోవడానికి పేరెంట్ టీచర్స్ మీట్ (పీటీఎం) మంచి వేదికని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి అన్నే రామకృష్ణయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన పీటీఎంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చితే రెట్టింపు నిధు లను ఖర్చు చేస్తోంది. నియోజకవర్గంలో 33,764 పిల్ల లకు సంబంధించి 15,894 తల్లుల ఖాతాల్లో రూ.43.89 కోట్లు జమ చేశా’మన్నారు. సబ్ కలెక్టర్ వినూత్న, డీఈవో వెంకటలక్ష్మమ్మ, డిప్యూటీ విద్యా శాఖ అధికారి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ అరుణ, ఎం పీపీ శిరీష, విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం శారద తదితరులు పాల్గొన్నారు.
సౌకర్యాల లేమిపై తల్లిదండ్రుల ఆగ్రహం
బుట్టాయగూడెం:ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాలలో యాజమాన్యం తీరును తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. పాఠశాలలో జరిగిన పేరెంట్–టీచర్స్ మీట్ కార్యక్రమానికి వందలాది మంది తల్లిదండ్రులు తరలిరాగా కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలంలో ఎండలోనే మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి కుర్చీలు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయలేదు. దీనిపై తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీయగా మీటింగ్ పెట్టమని మినిట్స్ వచ్చాయే తప్పా సౌకర్యాల కల్పనకు నిధులు రాలేదని ప్రిన్సిపాల్ చెప్పడంతో తీవ్రంగా ఖండించారు. తల్లిదండ్రు లనే పట్టించుకోని వారు పిల్లలను ఏవిధంగా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.