మందులు బంద్
ABN , Publish Date - May 21 , 2026 | 12:20 AM
అఖిల భారత కెమిస్టు సమాఖ్య పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి/న్యూస్ నెట్‌వర్క్):
అఖిల భారత కెమిస్టు సమాఖ్య పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. ఆన్‌లైన్ మందుల విక్రయాలను నిలుపుదల చేయాలని, డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందు ల విక్రయాల జరగకుండా చూడాలని, కొవిడ్ కారణంగా మందుల డోర్ డెలివరీకి ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మందుల వర్తకులు కదం తొక్కారు. కాగా మందుల షాపుల బంద్‌తో ప్రజలు కాస్తా ఇబ్డందులు పడ్డారు. జిల్లావ్యాప్తంగా 2,200 రిటైల్, 150 హోల్‌సేల్ షాపుల్లో మందుల అమ్మకాలు నిలిచిపోవడంవల్ల రూ.20 కోట్ల మేర టర్నోవర్ ఆగింది. ఏలూరు పవర్‌పేటలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యాల యం నుంచి హోల్‌సేల్, రిటైల్ వర్తకులు పాత బస్టాండ్ మీదుగా ఫైర్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసో సి యేషన్ అధ్యక్షుడు గుత్తా రవిచంద్ర కార్యదర్శి సయ్యద్‌బాజీ, కోశాధికారి ఎం.వెంకటరావు మా ట్లాడుతూ ఆన్‌లైన్ మార్కెట్‌తో వ్యా పారాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగ రంలో నాలుగు ప్రధాన సెంటర్ల షాపుల ద్వారా అత్యవసర మందుల విక్రయాలను జరిపారు.
జిల్లావ్యాప్తంగా నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ పిలు పులో భాగంగా జిల్లాలో బంద్ విజయ వంతమైందని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియే షన్ జిల్లా కార్యదర్శి వజ్రపు శేఖర్ చింతల పూడిలో తెలిపారు. జీలుగుమిల్లి మండలంలో సాయంత్రం ఐదు గంటల వరకు మందుల షాపులు తెరవలేదు. కామవరపుకోట మండలం లో మెడికల్ షాపులను మూసివేసి బంద్ పా టించినట్టు మండల నాయకులు రుద్రపాక వీర భద్రేశ్వరశర్మ, ఈడ్పుగంటి వెంకట సత్యనారా యణ శర్మ తెలిపారు. గణపవరం, నిడమర్రు మండలాల్లోని మెడికల్ షాపు యాజమాను లంతా మోటర్ సైకిల్‌తో నిరసన ర్యాలీ నిర్వ హించి గణపవరంలో నిరసన తెలిపారు. జిల్లా మెడికల్ షాపు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.సుబ్బరాజు, సభ్యులు సంకు ఉమామహేశ్వర రావు, జువ్వల రవి, పచ్చిపులుసు నాగేశ్వరరావు, కెల్లా దుర్గారావు, కొడూరి రాంబాబు, తదితరు లు నాయకత్వం వహించారు. జంగారెడ్డిగూడెం లో బోసుబొమ్మ సెంటర్ నుంచి మెడికల్ దుకా ణాల యజమానులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ బస్టాండు వరకు నిరసన ప్రదర్శన నిర్వ హించారు. మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు నున్న చైతన్యకుమార్, జిల్లా కార్యదర్శి శివరామ కృష్ణ, పట్టణ కార్యదర్శి కె.ప్రవీణ్, ఉపాధ్యక్షుడు ఎస్.నారాయణ, రాధాకృష్ణ, సీహెచ్ గంగాధర రెడ్డి, పోతుల గణేశ్, కె.రామకృష్ణ, హర్ష, దిలీప్, బాలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూజి వీడులో మందుల దుకాణాల బంద్ నిర్వహించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అసోసియేష న్ అధ్యక్షుడు ఎల్నేని జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. చాట్రాయి మండలంలో 30, ముది నేపల్లి మండలంలోని 15, కైకలూరు మండలం లో 45 మెడికల్ షాపులను మూసేశారు. కైక లూరులో కెమిస్టు, డ్రగ్గిస్టుల యూనియన్ నాయకులు పైడిమర్రి రాధాకృష్ణమూర్తి, ఓలేటి రాధాకృష్ణమూర్తి, రామ్‌శ్యామ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముసునూరు మండలంలోని 33 మెడికల్ షాపులను మూశారు. అసోసియేషన్ మండల అధ్యక్షుడు మందలపు వంశీ, సెక్రటరీ పరస శ్రీనివాసరావు, కోశాధికారి గుడివాడ వెం కటనరసింహారావు, జిల్లా అసోసియేషన్ కోశాధి కారి టి.శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలిదిండిలో మందుల షాపులను మూసివేసి యాజమానులు బంద్ పాటించారు.