డాక్టర్ కల నేరవేరకుండానే..
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:36 AM
చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని కలలుకంది. కష్టపడి చదివినప్పటికి మొదటిసారి ర్యాంకు సాధించ లేకపోయింది.
నరసాపురంలో విషాదచాయలు
నరసాపురం/గుడివాడ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని కలలుకంది. కష్టపడి చదివినప్పటికి మొదటిసారి ర్యాంకు సాధించ లేకపోయింది. అయినా పట్టు వీడలేదు.. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. అయినా ఎంబీబీఎస్ సీటు రాలేదు. చివరికి గుడివాడ గురురాజు హోమియోపతి మెడికల్ కాలేజీలో చేరింది. మొదటి ఏడాది పూర్తి చేసి రెండో సంవత్సరంలో అడుగుపెట్టింది. అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో భరించలేక ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని పీచుపాలెంలో తీవ్ర విషాదం నింపింది. తులసీ తండ్రి శ్రీనివాసరావు బైక్ మెకానిక్. తల్లి గృహణి.. సోదరుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి గుజరాత్‌లో ఉద్యోగం చేస్తు న్నాడు. తులసి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుతానని చెబుతూ ఉండేది. కుమార్తె కోరిక, పట్టుదలను చూసి తండ్రి ఇంటర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పించాడు. తర్వాత ఒక ఏడాది కోచింగ్ ఇప్పించాడు. సీటు రాక పోవడంతో తులసీ ఫిలిఫీన్స్‌లో మెడిసిన్ చేయాలనే ఆకాంక్షించింది. పేమెంట్ సీటు కావడంతో, ఇంట్లో వాళ్లు ఆర్థికంగా భరించలేక హోమియో కాలేజీలో చేరింది. హాస్టల్‌లో ఉంటూ మొదటి ఏడాది పూర్తి చేసింది. ఇటీవల తులసీకి కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లు బయటపడింది. కడుపు నొప్పితో బాధపడుతూ ఉండే దని సహచర విద్యార్థులు పేర్కొంటున్నారు. శుక్రవా రం కళాశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చి వారు తులసీ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి చూడగా, తన గదితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుమార్తె భౌతికకాయాన్ని, చూసి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్‌గా అం దరికి సేవలందిస్తుందని ఆశపడిన తల్లితండ్రులు కుమార్తె ఆత్మహత్యను నమ్మలేకపోతున్నారు.