Share News

మెడికల్‌ అక్రమాలకు అడ్డేలేదు..

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:17 AM

మెడికల్‌ దుకాణాలు, ఏజెన్సీల అక్రమ వ్యాపా రాలకు అడ్డేలేకుండా పోయింది. మనిషికి ఏ చిన్న అనారోగ్యం చేసినా, ప్రాణాలు కాపాడేది మందులు.

మెడికల్‌ అక్రమాలకు అడ్డేలేదు..

మెడికల్‌ అక్రమాలకు అడ్డేలేదు..

ఇస్టానుసారంగా మెడికల్‌ దుకాణాలు, ఏజెన్సీల నిర్వహణ

వేగవరంలో మత్తు మందుల వ్యవహారంతో కలకలం

జంగారెడ్డిగూడెం రూరల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): మెడికల్‌ దుకాణాలు, ఏజెన్సీల అక్రమ వ్యాపా రాలకు అడ్డేలేకుండా పోయింది. మనిషికి ఏ చిన్న అనారోగ్యం చేసినా, ప్రాణాలు కాపాడేది మందులు. అలాంటి మందులను విక్రయించే మెడికల్‌ దుకాణాలు, ఏజెన్సీలు నేడు సామాన్య ప్రజల ప్రాణాలతో, యువత భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఔషధ విక్రయ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. అర్హత కలిగిన వైద్యుల సంప్రదింపులు, ప్రిస్ర్కిప్షన్లు లేవు.. దుకాణాల్లో ఉండా ల్సిన సర్టిఫైడ్‌ ఫార్మాసిస్టులు అసలే లేరు! వ్యాపారులే వైద్యుల అవతారమెత్తి ఇష్టారీతిన మందులు కట్టబె డుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటికి తోడు మం దులను పంపిణీ చేసే ఏజెన్సీలో మరింత దారుణంగా లాభార్జనే ధ్యేయంగా విక్రయాలు సాగిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండం వేగవరంలో వెలుగు చూసిన ట్రామడాల్‌ మత్తు ఇంజక్షన్ల వ్యవహారం ఈ అక్రమ సామ్రాజ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

ఫ వేగవరంలో దిగ్ర్భాంతికర నిజాలు..

జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గుర్తించిన మత్తు మందుల వ్యవహారం ఈ ప్రాంతంలో మెడికల్‌ మాఫియా ఆగడాలకు అద్దంపడుతోంది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ వంటి ప్రాంతాల్లోని కంపెనీల నుంచి దిగుమతి చేసుకుని ఈ ప్రాంతంలోని మెడికల్‌ దుకా ణాలకు పంపిణీ చేసే ఏజెన్సీలను గుర్తించారు. ఇటు వంటి ప్రమాదకరమైన ఇంజక్షన్‌లు ఇప్పటి వరకు ఎన్ని లక్షల్లో అమ్మారో అర్ధం కాని పరిస్ధితి. ట్రామడాల్‌ ఇంజక్షన్‌ అనేది తీవ్రమైన శస్త్రచికిత్సలు పొందిన వారికి, క్యాన్సర్‌ బాధితులకు, తీవ్రమైన నొప్పులతో బాధపడే వారికి మత్తును నొప్పి తెలియకుండా ఉండేందుకు అర్హత కలిగిన వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే పరిమిత మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమ ంలో వ్యాపారులే వైద్యులుగా మారుతున్నారు. ఉమ్మడి పశ్చిమలో అనేక మందుల షాపుల్లో జబ్బు పేరు చెబితే మందులు ఇచ్చేస్తున్నారు. గర్భిణులు, చిన్న పిల్ల లకు సైతం తమ ఇష్టానుసారంగా మందులను ఇచ్చి సొమ్ముల చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు వంటి చీకటి వ్యాపారాలకు అడ్డుకట్ట వేసే అధికార యంత్రాంగం ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్పా దుకా ణాల వైపుకు రావడం లేదు. ఫలితంగా ఒంట్లో చిన్న పాటి కలతగా అనిపించినా ప్రజలు నేరుగా మెడికల్‌ దుకాణాలకు పరుగులు తీయడం పరిపాటిగా మారింది.

ఫ ఇంత దారుణమా...!

గతంలో మెడికల్‌ దుకాణాల తీరుపై అందిన ఫిర్యా దులతో జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఔషధ నియంత్రణ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో కాలం చెల్లిన మందు లను విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఖంగు తిన్నారు. వీటితో పాటు గర్భవిచ్చిన్న టాబ్లెట్‌లు, వయాగ్రా వంటివి విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తిం చారు. ఇప్పుడు మత్తు ఇంజక్షన్‌ల వ్యవహారం వెలుగు లోకి వచ్చింది. నిషేధిత మందుల పేర్లు దుకా ణాల్లో ప్రజలకు తెలిసే విధంగా ఉంచకపోవడంతో పాటు ఔషధ తనిఖీ అధికారి ఫోన్‌ నెం, చిరునామా పొందు పర్చి డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. ఈ విధ మైన నిబంధనలను మందుల షాపు యజమానులు తుంగలో తొక్కారు. మెడికల్‌ దుకాణాలను పెట్టేందుకు బీఫార్మసీ చేసిన విద్యార్థి నుంచి సర్టిఫికెట్‌ను ఒప్ప ందంపై తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారే తప్ప ఎటువంటి నియమ నిబంధనలను పాటించడం లేదు. కనీసం ఫార్మాసిస్టును కూడా ఏర్పాటు చేయడం లేదు.

ఫ తూతూ మంత్రంగా తనిఖీలు

జౌషఽధ అధికారుల ఉదాసిన వైఖరితో మందుల దుఖాణాల వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా బా హాటంగానే వ్రికయాలు జరుపుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి గాను సంబంధిత అధికారులకు తనిఖీల సమయంలో ముడుపులు చెల్లించడం జరుగు తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీని కారణంగానే నియమనిబంధనలను, ప్రజా ఆరోగ్యాన్ని ప్రక్కన పెట్టి అడ్డగోలు వ్యాపారాలకు అధికారులు తలూపుతున్నారని జిల్లా వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 04 , 2026 | 12:17 AM