మంత్రిగారి ఇలాకాలో దళారుల దందా
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:00 AM
నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కొందరు దళారుల అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేయడంపై మంత్రి పార్థసారధి సీరియస్ అయ్యారు.
మంత్రి పార్థసారథి సీరియస్
వెనక్కి ఇప్పించేందుకు చర్యలు
(నూజివీడు – ఆంధ్రజ్యోతి)
నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కొందరు దళారుల అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేయడంపై మంత్రి పార్థసారధి సీరియస్ అయ్యారు. ముసునూరు మండలంలో భూపంపిణీలో రెవెన్యూ పత్రాలు ఇప్పిస్తామని రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆయన దృష్టికి వెళ్లడంతో తక్షణం స్పందించారు. విదేశాలలో ఉన్న మంత్రి పార్థసారిథి ముసునూరు మండల నాయకులతో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. సూరేపల్లిలో రైతులను సమావేశపరిచి ఎవరికి సొమ్ము చెల్లించింది తెలుసుకొని తిరిగి ఇప్పించాలని స్థానిక నాయకులకు సూచించారు.