Share News

మావుళ్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:49 AM

మావుళ్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు క్యూట్టారు. పండగ సెలవులు పూర్తి కావడంతో అమ్మవారి దర్శ నానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలన్ని కిటికిటలాడాయి.

మావుళ్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
మావుళ్లమ్మను దర్శించుకున్న భక్తులు

వైభవంగా అమ్మవారి ఉత్సవాలు

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

డీఎస్పీ పర్యవేక్షణలో బందోబస్తు

భీమవరంటౌన్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మావుళ్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు క్యూట్టారు. పండగ సెలవులు పూర్తి కావడంతో అమ్మవారి దర్శ నానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలన్ని కిటికిటలాడాయి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి భక్తుల క్యూలైన్‌ ఆలయం వద్ద నుంచి యూ నియన్‌ బ్యాంకు రోడ్డులో సాగిపోయింది. అమ్మవారి ఆలయం వద్ద పందిర్లు భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం వరకు కొనసాగింది. ఆది వారం వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఇవో బుద్ధా మహాలక్ష్మినగేష్‌, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం పర్యవేక్షించారు. ఆలయ ప్రాంతంలో బందోబస్తును డీఎస్పీ రఘువీర్‌ విష్ణు దగ్గర ఉండి పర్యవేక్షించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆలయవద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్‌ పాయింట్‌లోని సీసీ కెమెరానలు వన్‌టౌన్‌ సిఐ నాగరాజు పర్యవేక్షించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పాటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. రాత్రి కూడా ఆలయం వద్ద రద్దీ కొనసాగింది. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణను చూసేందుకు రావడంతో లైటింగ్‌ ఏర్పాటు చేసిన రోడ్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద సాయంత్రం నుంచి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Jan 17 , 2026 | 12:49 AM