Share News

మావుళ్లమ్మ జ్యేష్ఠమాస జాతర ప్రారంభం

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:32 AM

మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారి గరగలకు ఆలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.

మావుళ్లమ్మ జ్యేష్ఠమాస జాతర ప్రారంభం
భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి గరగలను ఊరేగిస్తున్న వంశస్థులు, అధికారులు

మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గరగల ఊరేగింపు

భీమవరంటౌన్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) :మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారి గరగలకు ఆలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం.. అమ్మవారి పుట్టింటి, మెట్టింటి వారు అల్లూరి, మెంటే వంశస్థులు పూజలు చేసుకున్నారు. అనంతరం మేళ.. తాళాలు, డప్పువాయిధ్యాలు మార్మోగుతుండగా, గరగలను ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం, భీమేశ్వరస్వామివారి దేవస్థానం నుంచి మోటుపల్లివారి వీధిలోని గరగల గుడివద్దకు తీసుకువచ్చారు. అక్కడ గరగలను ఉంచి పూజలు చేశారు. నెల రోజులపాటు అక్కడ నుంచే గ్రామ సంచారం చేస్తారు. కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ద మహాలక్ష్మీనగేష్‌, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్‌, ఉదీశి మీనాక్షి అతికెల ఆంజనేయ ప్రసాద్‌, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్షి, మిర్తిపాటి గుణేశ్వరరావు, మల్లువలస లక్ష్మీ నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:32 AM