మావుళ్లమ్మ హుండీల ఆదాయం రూ.61.06 లక్షలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:41 AM
మావుళ్లమ్మ హుండీల సొమ్ములు 75 రోజులకుగాను లెక్కించగా అరవై ఒక లక్ష ఆరువేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
భీమవరంటౌన్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) మావుళ్లమ్మ హుండీల సొమ్ములు 75 రోజులకుగాను లెక్కించగా అరవై ఒక లక్ష ఆరువేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో హుండీల సొమ్ము లెక్కించారు. నగదుతోపాటు బంగారం 76 గ్రాముల 700 మిల్లీ గ్రాములు, వెండి 315 గ్రాములు హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారని తెలిపారు.. కాకినాడ పట్టణం ఎంఎస్‌ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గుణేశ్వరరావు, గొంతెన రమణ, యండా సత్యవతి, సాయికుమారి, సిబ్బంది పాల్గొన్నారు.