మావుళ్లమ్మకు ఆషాఢ సారె
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:40 AM
మావుళ్లమ్మ నామస్మరణతో శనివారం ఆలయం మార్మోగింది. వేలాదిమంది మహిళలు అమ్మవారికి సారె అందించేందుకు తరలి రావడంతో కిటకిటలాడింది.
వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు.. కిటకిటలాడిన ఆలయం
భీమవరంటౌన్, ఆగస్టు 1(ఆంరఽధజ్యోతి): మావుళ్లమ్మ నామస్మరణతో శనివారం ఆలయం మార్మోగింది. వేలాదిమంది మహిళలు అమ్మవారికి సారె అందించేందుకు తరలి రావడంతో కిటకిటలాడింది. మావుళ్లమ్మకు భక్తులు వెయ్యి కేజీల ఆషాఢ మాస సారె అందించారు మందుగా మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారి పూరి గుడిసె వద్దకు భక్తులు సారెతో చేరుకున్నారు. అక్కడనుంచి మేళతాళాలు, వేదమంత్రాలతో ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మినగేష్ పర్యవేక్షణలో మహిళలు సారెతో ఆలయానికి బయలుదేరారు. భీమేశ్వరస్వామి ఆలయం రోడ్డు, పొట్టి శ్రీరాములు విగ్రహం, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు, ఆవుళ్లమ్మ గుడి రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. ప్రధానార్చకుడు మల్లికార్జునశర్మ సంప్రోక్షణ, పూజలు చేసి అమ్మవారికి సారె నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు సారెను ప్రసాదంగా పంపిణీ చేశారు. ఆలయ ఛైర్మన్ బి.నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాసరావు, పుదిసి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి, ఆరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, ఎం.లక్ష్మినిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు, పాపోలు ఏడుకొండలు పర్యవేక్షించారు.