మావుళ్లమ్మకు ఆషాఢ సారె
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:12 AM
భీమవరం మావుళ్లమ్మకు హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు ఆషాఢ మాస సారెను అందించారు.
భీమవరం రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : భీమవరం మావుళ్లమ్మకు హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు ఆషాఢ మాస సారెను అందించారు. శనివారం పద్మావతి వేంకటేశ్వరస్వామి మంది రం నుంచి అల్లం రమేష్– సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహకారంతో సుమారు వెయ్యి కేజీల స్వీట్స్‌తో వందలాది మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని సారె అందించారు. మందిర అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సరిపిడకల రామారావు, జనపాటి మధుసూదనరావు, పెన్నాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.