Share News

మావుళ్లమ్మ హుండీల ఆదాయం రూ.51.52 లక్షలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:37 AM

భీమవరం మావుళ్లమ్మ దేవస్థానంలో హుండీల సొమ్ములను గురువారం లెక్కించగా 28 రోజులకు గాను 51లక్షల 52వేలు 32రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం సహాయ కమిషనర్‌ బుద్ధా మహాలక్ష్మీనగేష్‌ తెలిపారు.

మావుళ్లమ్మ హుండీల ఆదాయం రూ.51.52 లక్షలు
మవరం మావుళ్లమ్మ దేవస్థానంలో సొమ్ములు లెక్కిస్తున్న సిబ్బంది

భీమవరంటౌన్‌, ఫిబ్రవరి26(ఆంధ్రజ్యోతి):భీమవరం మావుళ్లమ్మ దేవస్థానంలో హుండీల సొమ్ములను గురువారం లెక్కించగా 28 రోజులకు గాను 51లక్షల 52వేలు 32రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం సహాయ కమిషనర్‌ బుద్ధా మహాలక్ష్మీనగేష్‌ తెలిపారు. నగదుతోపాటు 33 గ్రాముల 240 మిల్లీ గ్రాముల బంగారం, 189 గ్రాముల వెండితోపాటుగా పలు విదేశాల కరెన్సీ నోట్లు వచ్చా యని తెలిపారు. ఈ లెక్కింపును కృష్ణా జిల్లా సింగరాయపాలెం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.గంగాశ్రీదేవి పర్యవేక్షణలో చేపట్టారు. ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, ధర్మకర్తలు మీనాక్షి, శిరీష, పాపోలు ఏడుకొండలు, కారెంపూడి ఆదిలక్ష్మి, జి.రమణ, వై.సత్యవతి, బన్ను ప్రసాద్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆచంటేశ్వరుని హుండీ ఆదాయం రూ. 5.12 లక్షలు

ఆచంట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):ఆచంటేశ్వరుని హుండీల సొమ్ము ఆదాయాన్ని గురువారం లెక్కించగా 5లక్షల 12వేల 643 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రంగరాజు తెలిపారు. కార్తీకపౌర్ణమి తరువాత శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా హుండీల సొమ్ము ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవస్థానం అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ నెక్కంటి గజేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:37 AM