అంతర పంటల సాగు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:19 AM
‘అంతర పంటల సాగుతో రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, కొబ్బరి, ఆయి ల్‌పామ్ వంటి ప్రధాన పంటల్లో అంతరంగా కోకో, పసుపు, వక్క, మిరియం వంటి అంతరపంటల సాగును ప్రోత్సహిస్తూ రాష్ట్ర జీడీపీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయడమే ధ్యేయం’ అని జిల్లా ఉద్యానశాఖాధికారి కె.షాజానాయక్ అన్నారు.
పెదవేగి మండలంలో పీడబ్ల్యూసీ బృందం పరిశీలన
పెదవేగి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘అంతర పంటల సాగుతో రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, కొబ్బరి, ఆయి ల్‌పామ్ వంటి ప్రధాన పంటల్లో అంతరంగా కోకో, పసుపు, వక్క, మిరియం వంటి అంతరపంటల సాగును ప్రోత్సహిస్తూ రాష్ట్ర జీడీపీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయడమే ధ్యేయం’ అని జిల్లా ఉద్యానశాఖాధికారి కె.షాజానాయక్ అన్నారు. గురువారం పెదవేగి మం డలంలో రాష్ట్ర ప్రైస్, వాటర్, కూపర్ (పీడబ్ల్యూసీ) బృందం బినయ్ సోరంగ్, స్వస్తిక్ త్యాగి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీపు రంలోని ఆదర్శరైతు ఉప్పలపాటి చక్రపాణి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పామ్, కొబ్బరి అందులో అంతరంగా సాగవుతున్న కోకో, వక్క, పసుపు, మిరియం, దాల్చిన చెక్క వంటి పంటల సాగును పరిశీలించి, సాగు వివరాలను రైతు నుంచి తెలుసుకున్నారు. డాక్టర్ ఎంఎల్‌వీ.ప్రసాద్‌కు చెందిన కొబ్బరి, కోకో పంటల సాగును బృందం పరిశీలించింది. అనంతరం ఏపీ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని బృందం సంద ర్శించి, పామాయిల్ గింజల ప్రాసెసింగ్, ముడి నూనె తీసే విధానాన్ని పరిశీ లించింది. ఈ సందర్భంగా షాజానాయక్ మాట్లాడుతూ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్‌మెంట్ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
మూడు జోన్లుగా ఎంపిక..
తిరుపతి, అమరావతి, విశాఖపట్నం మూడు జోన్లుగా ఎంపిక చేసి, ఒక్కో జోన్‌లో 9 జిల్లాలతో అమరావతి ఎకనా మిక్ రీజనల్ డెవలప్‌మెంట్‌కు సంబం ధించి ప్రైమరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్‌లను ఎన్నుకుని, అక్కడ ఉన్న తలసరి ఆదాయం, జీడీపీని ఎలా పెంచాలనే దానిపై బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసిందన్నారు. పర్యట నలో ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు కె.సంతోష్, మండల ఉద్యానశాఖాఽ దికారిణి ఎం.రత్నమాల, ఏపీ ఆయిల్‌ఫెడ్ డివిజనల్ అధికారి గోసుల జగదీశ్వర్‌రెడ్డి, పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ వీరంకి శ్రీనివాసరావు, అభ్యుదయ రైతు ఇంజనీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.