Share News

మాస్టర్‌ ప్లాన్‌!

ABN , Publish Date - May 31 , 2026 | 12:44 AM

నగరపాలక సంస్థలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లపై అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. స్థానికుల అభ్యంత రాలు, సూచనలతో పనిలేకుండానే ఇష్టారాజ్యంగా రోడ్ల ప్లాన్‌లలో మార్పులు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మాస్టర్‌ ప్లాన్‌!
శాంతినగర్‌లో బహుళ అంతస్తుల భవనం కోసం విస్తరిస్తున్న రోడ్డు ఇదే..

శాంతినగర్‌లో అధికారుల మాయాజాలం

ఇష్టారాజ్యంగా రోడ్ల మార్పులు

80 అడుగుల రోడ్డు 60కు కుదింపు

30 అడుగుల రోడ్డు 60కి పెంపు

ఓ భవనం కోసమే తాజాగా పెంచారంటూ విమర్శలు

మా దృష్టికి రాలేదు : ఈడా చైర్మన్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నగరపాలక సంస్థలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లపై అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. స్థానికుల అభ్యంత రాలు, సూచనలతో పనిలేకుండానే ఇష్టారాజ్యంగా రోడ్ల ప్లాన్‌లలో మార్పులు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శాంతినగర్‌లో దాదాపుగా 14 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ కలెక్టరేట్‌ వెనుక భాగంలో ఏలూరు– నూజివీడు రోడ్డు 80 అడుగుల రోడ్డుగా మాస్టర్‌ ప్లాన్‌లో నమోదైంది. అయితే ఈ ఆర్‌అండ్‌బీ రోడ్డును 60 అడుగులకు కుదించి ఇక్కడ రూ.2 కోట్ల పైబడి వ్యయంతో అభివృద్ధి చేసి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తోంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కూడా విస్తరణ అవకాశం లేకుండా చేశారు. రెండేళ్ల క్రితం శాంతినగర్‌లో 2,3 రోడ్ల మధ్య ఒక బహుళ అంతస్తు భవనం నిర్మాణం ప్రారంభమైంది. దీనిపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమర్షియల్‌ జోన్‌ కాకపోయినప్ప టికీ ఈ భవనం ఎందుకు నిర్మించడానికి అను మతించారంటూ కోర్టుకెక్కడంతో.. ఇక్కడ ఆ భవన నిర్మాణం నిలుపుదలకు కోర్టు స్టే ఇచ్చింది. తాజా గా ఇటీవల రెండో రోడ్డును మాస్టర్‌ ప్లాన్‌లో 30 అడుగులు ఉన్న దాన్ని అకస్మాత్తుగా 60 అడు గులు పెంపు చేసే ఆవశ్యకత ఎందుకొచ్చిందన్న విమర్శలు రేగుతున్నాయి. దీనిని విస్తరించడం వెనుక ఎవరు చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. ఈ భవన నిర్మాణం చేస్తున్న వ్యక్తికి వ్యాపార పరంగా లబ్ధి చేకూర్చేందుకే జరిగిందన్న విమర్శలున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు మార్పుపై స్థానిక 21వ డివిజన్‌ కార్పొరేటర్‌కు సమాచారం లేకపోవడం కొసమెరుపు. ఇది వాణిజ్యపరమైన భవనాల నిర్మాణానికి అవకాశం లేదు. దీన్ని 60 అడుగుల పెంచడానికి స్థానికులు సుముఖంగా లేరు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఏమి తీసుకోకుండానే తెర వెనుక మార్పిడి యత్నం జరిగిందని సమాచారం. దీన్ని స్థానికంగా నివాసితులు అడ్డుకోవడంతో వారు శాంతించాక పనులు చక్కబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఏ రోడ్డు చూసినా అధ్వానమే..

శాంతినగర్‌లో మెయిన్‌ రోడ్డు తప్ప లోపల ఉన్న అంతర్గత రోడ్లన్నీ చాలా అఽధ్వానంగా ఉంటున్నాయి. వీటిని బాగు చేయండంటూ ప్రజలను మొత్తుకుంటున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రోడ్లుపై అతుకులు, గుంతులతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఇటువైపుగా రిటైర్డు ఉద్యోగులు, అధికారులు నివాసం ఉంటున్నారు. అక్కడక్కడ విద్యాసంస్థలూ ఉన్నాయి. దీంతో ఇటు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా రోడ్లు బాగు చేయాలన్న శ్రద్ధ లేకపోగా, ఆ బహుళ అంతస్తుల భవనానికి మాస్టర్‌ ప్లాన్‌ మార్పుపై స్థానికులు గుర్రుగా ఉన్నారు. దీనిపై ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌ను వివరణ కోరగా ‘మాస్టర్‌ ప్లాన్‌ మార్పు నా దృష్టికి రాలేదు. ఎవరు ఇప్పటి వరకు ప్రస్తావించ’లేదన్నారు.

Updated Date - May 31 , 2026 | 12:44 AM