రైతులకు అండగా మార్టేరు వ్యవసాయ కేంద్రం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:14 AM
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా స్థానం 1925లో స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీ సూపరింటెండెంట్ సి.ఆర్. శ్రీనివాస అయ్యంగార్ ఈ పరిశోధనా స్థానానికి మొట్టమొదటి అధిపతిగా నియమితుల య్యారు.
నేడు మార్టేరులో కిసాన్ మేళా సదస్సు.. ప్రముఖులు, శాస్త్రవేత్తలు రాక
దాదాపు 100 ఏళ్లుగా రైతులకు చేయూత 8 70 రకాల వరి వంగడాల రూపకల్పన
పెనుమంట్ర, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి):పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా స్థానం 1925లో స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీ సూపరింటెండెంట్ సి.ఆర్. శ్రీనివాస అయ్యంగార్ ఈ పరిశోధనా స్థానానికి మొట్టమొదటి అధిపతిగా నియమితుల య్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల అవస రాలను తీర్చడానికి 2005లో ఈ పరిశోధనా స్థానాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంగా అభివృద్ధి చేశారు. మార్టేరు ప్రాంతం వరి పంటలో ఆశించే ప్రధాన సమస్యలైన దోమపోటు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గితెగులు, ఎలుకలు, తుఫాన్‌ల తాకిడికి ఆలవాలంగా ఉంటున్నం దున ఇక్కడ చేసే పరిశోధనలు అత్యంత ఆదరణ చూరగొన్నాయి. 79 ఎకరాల విస్తీ ర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో సుమా రు 65 ఎకరాలలో వరి పంటపై పరిశోధన, పలు తరగతులకు చెందిన విత్తనోత్పత్తి జరు గుతూ ఉంటుంది. సంస్థ స్థాపించి ఇప్పటికే వందేళ్లు పూర్తి చేసుకుంది. బుధవారం ఉద యం పది గంటలకు మార్టేరు పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కిసాన్ మేళాకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
అధికదిగుబడినిచ్చే ఎంటీయూ రకాలు ఇవే..
ఎంటీయూ 3626 (ప్రభాత్) అనే రకం ఉప్పుడు బియ్యం మా ర్కెట్‌లో తనదైన ముద్రవేసింది. ఈ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడిన స్వర్ణ రకం (ఎంటీయూ 7029) ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా జాతీయ స్థాయిలో సుమారు 4.5మిలియన్ హెక్టార్లలో సాగుచేయబడుతూ బియ్యం మార్కెట్‌లో తన ప్రత్యేకత చాటుకుంది. 1991–2010సంవత్సరాల మధ్య దోమపోటు, అగ్గి తెగులు తట్టుకునే రకాల రూపకల్పనకు చేసిన పరిశోధనలలో భాగంగా రూపొందించబడిన ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాలు జాతీయ, అంతర్జాతీయ బియ్యం ఎగుమతి మార్కెట్లో తమ ప్రత్యేకత చాటుకున్నాయి. మార్టేరు నుంచి రూపొందించబడిన వరి రకాలు ప్రస్తుతం మన రాష్ట్రంలో 51.01 శాతం విస్థీర్ణంలో అనగా 13 లక్షల హెక్టార్లలో సాగవుతూ రైతుల మన్ననలు చూరగొన్నాయి. దేశం మొత్తం మీద 13 రాష్ట్రాలలో 25శాతం విస్థీర్ణంలో అంటే 10 మిలియన్ హెక్టార్లకుపైగా సాగులో ఉండి సాలీనా రూ.35వేల కోట్లకుపైగా ఆదాయం కల్పిస్తున్నాయి. రాష్ట్ర రైతులు ఈ రకాలతో సాలీనా రూ.12 వేల కోట్లకుపైగా ఆదాయం పొందుతున్నారు. ఇక్కడి రకాలు ప్రపంచం మొత్తంమీద ఏడు దేశాలలో సాగవుతున్నాయి అంటే రైతుల ఆర్థిక స్వాలంబనలో మార్టేరు పాత్ర చాలా ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు.
వాతావరణానికి తట్టుకునే వరి రకాలు ఇవే..
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా 2010–20 దశకంలో ముంపు, చవుడు, చేను పడకుండా ఉండే రకాలను, చీడపీడలను తట్టుకునే రకాలను, డెల్టా ప్రాంతాల్లో తినడానికి అనుకూలమైన సన్నగింజ రకాలను రూపొందించింది. అధిక దిగుబడిని ఇచ్చే రకాలలో కృష్ణవేణి (ఎంటీయూ 2077), ఇంద్ర (ఎంటీయూ 1061), కృష్ణా డెల్టాలో చేను పడిపోనీ ఎంటీయూ 1318, ఎంటీయూ 1121 రకాలు, సన్నగింజ రకాలైన ఎంటీయూ 1224, ఎంటీయూ 1262 రకాలు, ఎగుమతికి అనుకూలమైన రకాలు ఎంటీ యూ 1010, 11534, 1156, 1293, 1290 రకాలు మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధిక దిగుబడిని ఇస్తూ ఎగుమతికి మార్కెట్‌లో దోహదం చేశాయి. ముంపు ప్రాంతాలలో బాడవ మసూరి (పీఎల్‌ఏ 1100), భీమా (ఎంటీయూ 1140), ఎంటీయూ 1232రకాలు, చౌడు ప్రాంతాలకు అనువైన ఎంటీయూ 1290, 1293 రకాలు, కృష్ణా గోదావరి డెల్టాల్లో చేను పడని ఎంటీయూ 1121, 1318 రకాలు సుస్థిర వరి దిగుబడిని అందించడంలో దోహదం చేశాయి.
అగ్రగామిగా నిలిచిన వరి వంగడాలు..
దేశం మొత్తం మీద బ్రీడర్ సీడ్ ఉత్పత్తిలో ఈ పరిశోధన స్థానం 50 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ప్రతి ఏటా ‘స్వర్ణ (ఎంటీయూ 7029)’, ‘కాటన్ దొర’ సన్నాలు (ఎంటీయూ 1010) రకాలు 500 క్వింటాళ్లకు పైగా బ్రీడర్ సీడ్ ఉత్పత్తి జరిగి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా స్వర్ణ, కాటన్‌దొర సన్నాలు, చంద్ర, తరంగిణి రకాలు మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక మొత్తం విస్తీర్ణంలో సాగుచేయబడుతున్నాయి.
ఈ పరిశోధనా కేంద్రం విత్తనాల్లో నిద్రావస్థ తొలగించే నైట్రిక్ యాసిడ్ పద్ధతి, ఎలుకల నియంత్రణకు తక్కువ ఖర్చుతో కూడిన ఎర పద్ధతి, కోతుల యాజమాన్యం కోసం సోలార్ ఫెన్సింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. పురుగులు, తెగుళ్ల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం, నేరుగా వరి విత్తే పద్ధతి, నానో టెక్నాలజీ మొదలైన అంశాలపై ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ పరిశోధనలు కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య పరిశోధనలు జరుగుతున్నాయి. ుఇక్కడి శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా 2013, 2015లలో ఉత్తమ అఖిల భారత సమన్వయ పరిశోధనా కేంద్రంగా జాతీయ స్థాయిలోనూ, 2016లో ఉత్తమ పరిశోధన స్థానంగా రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందింది.
శతాబ్ది కాలంలో పరిశోధన కేంద్రం ప్రగతి
గత వందేళ్లలో ఈ కేంద్రం నుంచి 70 రకాల వరి వంగడాలు రూపొందించబడి రైతుల మన్ననలు చూరగొన్నాయి. హరిత విప్లవానికి ముందు 23 రకాలు, తరువాత 47 అధిక దిగుబడి రకాలు ఈ స్థానం నుంచి అభివృద్ధి చేయబడ్డాయి. ఇక్కడి శాస్త్రవేత్తలు రూపొం దించిన అధిక దిగుబడి సామర్థ్యం కలిగి, చీడ పీడలను తట్టుకునే వరి రకాలను రూపకల్పన వల్ల రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది.
రైతులను చైతన్యపరిచేందుకే కిసాన్ మేళా
మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాణిజ్య స్థితిగతులపై రైతులకు అవగాహన కల్పించి, చైతన్యపరిచేందుకే కిసాన్ మేళా నిర్వహిస్తున్నాం. వరి పంటలో సార్వాదాళ్వా పంటల్లో ప్రతికూల, అనుకూల పరిస్థితిలను రైతులకు ఎదురైనా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన, చీడ పీడలు తెగుళ్లు, విభిన్న రీతుల్లో వరి సాగు చేసినా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తాం. రైతులు పండించిన మేలురకం ధాన్యానికి ప్రస్తుత మా ర్కెట్లో ఉన్న ధర, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఏ విధంగా దేశ ఆదాయం, రైతు ఆదాయం పెరుగుతుందనే మార్గాలను అన్వేక్షించి రైతాంగాని తెలియపరిచేందుకు కిసాన్ మేళా దోహదం చేస్తుంది.
– డాక్టర్ పి.శ్రీనివాస్, వరి పరిశోధన స్థానం, సహ సంచాలకుడు, మార్టేరు