Share News

ఏఎంసీలకు భారీ లక్ష్యాలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:35 AM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఈ ఏడాది సెస్‌ వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఏఎంసీలకు భారీ లక్ష్యాలు

తగ్గుతున్న సెస్‌.. ఆదాయంలో కోతలు

(తణుకు–ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఈ ఏడాది సెస్‌ వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు నెలల తర్వాత కమిటీల నిర్వహణ బడ్జెట్‌ను మం జూరుచేసింది. ఫలితంగా కమిటీల గౌరవ వేత నాలు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలకు మార్గం సుగమమైంది. మరోవైపు గత ఏడాది కంటే అదనంగా సెస్‌ లక్ష్యాన్ని నిర్దేశించడంతో అధికారులు ఒకింత ఆలోచనలో పడ్డారు. గడ చిన ఏడాది చివరి వరకు ఉత్కంఠగా ఉన్నారు. అంతలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబం ధించిన సెస్‌ను సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా మంజూరుచేసింది. దీనివల్ల సునాయా సంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఏటా ఇదే తరహా లో బకాయిలు చెల్లిస్తే ఇబ్బందులు వుండవు. లేదంటే సెస్‌ వసూళ్లు కష్టతరం కానుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కమిటీల వారీగా సెస్‌ తగ్గుతూ వస్తోంది. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వ్యాపారాలు తగ్గాయి. గతంలో పండ్లు, ఉల్లి విరివిగా దిగుమతయ్యేవి. ఇప్పుడు ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంకో వైపు మార్కెట్‌ కమిటీ సెస్‌ పెరుగుతోంది. భీమవరం, ఉండి మార్కెట్‌ కమిటీలకు జిల్లాలో అధిక లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండు మార్కెట్‌ కమిటీల పరిధిలో ఆక్వా నుంచి అధిక ఆదాయం వస్తోంది. గత రెండేళ్లుగా ఆక్వా ఉత్పత్తులు తగ్గుతున్నాయి. దీనివల్ల సెస్‌ ఆదా యంలోనూ కోత పడుతోంది. తణుకు, అత్తిలి, పెనుగొండ, ఆచంట మార్కెట్‌ కమిటీలకు ముఖ్యంగా వరి ఉత్పత్తులపైనే సెస్‌ లభించ నుంది. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ సెస్‌ విడుదల చేస్తేనే వీటన్నింటికీ లక్ష్యం చేరుకో వడం సులభతరం అవుతోంది. ఈ ఏడాది జిల్లాలోని 10 మార్కెట్‌ కమిటీలకు రూ. 79.74 కోట్లు నిధులు లక్ష్యాన్ని ఇచ్చింది.

పుంతకు తీరని చింత

కూటమి ప్రభుత్వంలో మార్కెట్‌ కమిటీల ఏర్పాటులోనే ఆలస్యమైంది. తీరా కమిటీలు వేశాక పుంత రహదా రులకు నిధులు ఇస్తారని కమిటీలు ఆశించాయి. ఇప్పటి వరకు పైసా మం జూరు చేయలేదు. యార్డుల్లో కాస్త వస తుల కల్పనకు నిధులు వెచ్చించారు. వాటి బిల్లులు మంజూరు కాలేదు. ఏప్రిల్‌లో బడ్జె ట్‌కు ఆమోదం తెలపాలి. మూడు నెలల తర్వాత అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం నిర్వ హణ బిల్లులకు డోకా ఉండదు. కానీ రైతుల నుంచి పుంత రహదారుల కోసం డిమాండ్‌ పెరుగుతోంది. దీనికోసం నిధులు ఇవ్వాలని పాలకవర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. క్షేత్రస్థాయిలో 20 శాతం సెస్‌ను రైతు ప్రయోజనాల కోసం వెచ్చించాలన్న నిబంధన ఉంది. అది నెరవేరడం లేదు. కేవలం సెస్‌ రాబట్టేందుకు కమిటీలు పరిమితం అవు తున్నాయి.

Updated Date - Jun 23 , 2026 | 12:35 AM