ఘాటు తగ్గిన మిర్చి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:55 PM
మార్కెట్లో పచ్చిమిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు వారా లుగా పెరిగిన ధరలు ఈ వారం ఏకంగా సగానికి పడ్డాయి. రెండు వారాలుగా కిలో పచ్చిమిర్చి రూ.60 ఉండేది. ఇప్పుడు కిలో రూ.30కు పడింది.
అదే బాటలో ఉల్లి.. ధర పెరుగుతున్న టమాటా
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి):మార్కెట్లో పచ్చిమిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు వారా లుగా పెరిగిన ధరలు ఈ వారం ఏకంగా సగానికి పడ్డాయి. రెండు వారాలుగా కిలో పచ్చిమిర్చి రూ.60 ఉండేది. ఇప్పుడు కిలో రూ.30కు పడింది. పచ్చిమిర్చి సాగు పెరగడంతో వీటి ధరలు పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు పచ్చళ్ల సీజన్ కావడంతో ఎండు మిర్చివైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతారు. దీనిలో భాగంగా వీటి వినియోగం తగ్గడానికి ఒక కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఉల్లి హోల్‌సేల్‌గా క్వింటా రూ.900 నుంచి 1500 మఽధ్య విక్రయాలు జరిగాయి. నాణ్యమైన ఉల్లిని రూ.100కు 5కిలోలు రిటైల్డ్ వ్యాపారులు ఇస్తున్నారు. మధ్యరకం ఉల్లి రూ.100కు 6కిలోలు ఇస్తున్నారు. ఆటోల్లో తిరిగి అమ్మేవారు మాత్రం మధ్యరకం, మూడవ రకం ఉల్లిని కలిపి రూ.100కు 7కిలోల వంతున అమ్ముతున్నారు. మొత్తం మీద ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడంతో వీటిని కొనుగోలు చేసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ నెలలో ఉల్లిని నిలువ చేసుకోవడానికి అనువుగా ఉండటంతో ఎక్కువ మంది బస్తా(50)కొలది కొనుగోలు చేయడం కనిపించింది.
టమాటా ధర మరింత ప్రియం
మార్కెట్లో టమాటా ధర పెరుగుతోంది. హోల్‌సేల్‌గా ఆదివారం మార్కెట్లో ట్రే(25కిలోలు) రూ.600కు పలికింది. అయితే ట్రాన్స్‌పోర్టు చార్జీలు, జట్లు కూలి కలుపుకుని రిటైల్డ్ వ్యాపారులు కిలో రూ.30కు విక్రయిస్తున్నారు. మొన్నటి వరకు ట్రే రూ.450కు హోల్‌సేలుగా విక్రయించడంతో రిటైల్‌గా కిలో 20కు అమ్మేవారు. మదనపల్లి మార్కెట్లో కూడా టమాటా ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్న నేపథ్యంలో టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది టమాటాను పచ్చళ్లకు వినియోగిస్తారని, దీంతో ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు నిలకడగానే ఉన్నాయి. వంకాయలు కిలో రూ.50, బీరకాయలు రూ.50, బెండ, దొండ కిలో రూ.40, దోస రూ.30, బంగాళ దుంప రూ.30, చిక్కుళ్లు కిలో రూ.80 నుంచి 100. క్యారెట్, బీట్‌రూట్ కిలో రూ.40 నుంచి 50, కాకర రూ.50, క్యాప్సికమ్ రూ.80, పొట్ల కాయ ఒక్కటి రూ.30, బీన్స్ రూ.100కు అమ్ముతున్నారు.
నిమ్మ ధర పైకి..
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్ర జ్యోతి): నిమ్మ ధర రోజు రోజుకు పెరిగిపోతోంది, నిమ్మ దిగుబడి బాగున్న సమయంలో కేజీ రూ.50 లోపే పలుకగా ప్రస్తుతం రైతుల దగ్గర నిమ్మ లేకపోవడంతో కేజి రూ.150 నుంచి 160కి పలు కుతోంది. ముఖ్యంగా ఏ గ్రేడ్ నిమ్మను రిటైల్ వ్యాపా రులు రూ.180 కూడా విక్రయిస్తున్నారు. తాజాగా రైతుల దగ్గర నిమ్మ కేజి రూ.140 వరకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క వేడి తీవ్రత పెరుగుతుండటంతో నిమ్మకాయల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఆరేళ్ల క్రితం నిమ్మ ధర ఇంత స్థాయిలో ఉంది. మల్లి ఇప్పుడు అదే పరిస్థితి ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
నిమ్మ దిగుబడి సాధారణంగా నవంబరు డిసెంబ ర్‌లో తగ్గేది.. కానీ ఈ ఏడాది దిగుబడి జనవరి నెల చివరి వరకు దిగుబడి బాగుండగా ఎండ వేడి పెరి గాక దిగుబడి మందగించింది. మల్లి నిమ్మ కాయల దిగుబడి ఊపందుకోవాలంటే జూన్ జూలై వరకూ ఆగాల్సి వస్తుంది. ఈ వేసవిలో నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉండటంతో డిమాండ్‌కు తగ్గ నిమ్మకాయలు లేక మార్కెట్‌లో నిమ్మకాయలు బంగా రంలా చూసి విక్రయిస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో నిమ్మకాయలకు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.