వణికిన మన్యం
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:39 AM
కుండపోత వర్షానికి ఏజెన్సీలోని బైనేరు, జల్లేరు, విప్పలపాడు, రెడ్డిగణపవరం, కెఆర్ పురం తూర్పు, పడమటి కొండవా గులు, వీరన్నపాలెం, పీఆర్ గూడెం, ముంజులూరు, కామవరం, వేపుల పాడు, డోలుగండి, కోర్సవారిగూడెం, రెడ్డిబోడ్డేరు అటవీ ప్రాంతంలోని కొండవాగులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
వణికిన మన్యం
పొంగిన కొండవాగులు.. తెగిపోయిన రహదారులు
ఏజెన్సీలో కుండపోత
బుట్టాయగూడెం: కుండపోత వర్షానికి ఏజెన్సీలోని బైనేరు, జల్లేరు, విప్పలపాడు, రెడ్డిగణపవరం, కెఆర్ పురం తూర్పు, పడమటి కొండవా గులు, వీరన్నపాలెం, పీఆర్ గూడెం, ముంజులూరు, కామవరం, వేపుల పాడు, డోలుగండి, కోర్సవారిగూడెం, రెడ్డిబోడ్డేరు అటవీ ప్రాంతంలోని కొండవాగులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జీలుగు మిల్లి నుంచి బుట్టాయగూడెం మీదుగా పోలవరం మండలం గూటాల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే రోడ్డు పలుచోట్ల వరద ఉధృతికి కొట్టు కుపోయింది. విప్పలపాడు వద్ద జల్లేరు కొండవాగుపై నిర్మిస్తున్న వంతెన పైభాగంలోని మెటీరియల్, సిమెంటు శ్లాబు, తాడితోట సమీపంలో పొ లాల నుంచి వరద నీరు దిగువకు పోవడానికి హైవేకు అడ్డంగా రోడ్డుకు లోపలి భాగంలో చిన్నపాటి వంతెన నిర్మించగా కొట్టుకుపోయింది. కేఆర్ పురం తూర్పు కాలువ ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో జనాలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ట్రాక్టరు పెట్టారు. వరద పొలాల్లోకి చేరడంతో గిరిజన మహిళలు దోమ తెరలు, చీరలతో చేపలను పట్టుకున్నారు.
కొండవాగుల ఉగ్రరూపం
ఏజెన్సీ ముఖద్వారంగా పిలువబడే మన్యంలోని బుట్టాయగూడెంను బుధవారం కొండవాగులు దిగ్బంధనం చేశాయి. బుట్టాయగూడెంకు నా లుగు దిక్కులను ఉన్న కేఆర్ పురం తూర్పు, పడమర, విప్పలపాడు, బుట్టా యగూడెం–జంగారెడ్డిగూడెం ప్రాంతాల మధ్యన ఉన్న సుద్దకాలువలు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో బయట ప్రాంతాల జనా లు లోపలకు, లోపల ప్రాంతాల జనాలు బయట ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేకపోయింది. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు గం టల తరబడి వేచి ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కూడా 30 శాతం మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయారు. దీంతో మండలంలో 6వ తేదీకి ఎన్నికలు వాయిదా వేశారు.
జల్లేరు జలాశయం గేట్లు నుంచి వరదనీరు
గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం రెండు గేట్లను బుధవారం మొదటిసారిగా ఎత్తి రెండు వేల క్యూసెక్కుల వరదనీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని కొండవాగుల ద్వారా 4500క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వస్తుండగా ముందు జాగ్రత్త చర్యగా రెండు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడు దల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ సురేష్ తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తమ్మిలేరు రిజర్వాయరుకు భారీగా వరద
చింతలపూడి:చింతలపూడి సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయరుకు ఎగువ నుంచి, పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయరు నీటిమట్టం 336 అడుగులు ఉంది. 351 అడుగులకు చేరితే దిగువకు నీరు విడుదల చేస్తారు. ఎగువ నుంచి గంటకు 5800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరింత వరద వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పంటలకు పెట్టిన పెట్టుబడి నీటిపాలు..
వేలేరుపాడు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి):మురసు తుఫాన్‌తో 48 గంట లుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా వేలేరుపాడు మండలం అత లాకుతలమైంది.వాగులు వంకలు పొంగిపొర్లడంతో ఎటుచూసినా చెరువులను తలపించేలా వరదనీరు పోటెత్తడంతో మండలానికి భారీనష్టం వాటిల్లింది. పెదవాగు ప్రాజెక్టు ఎగువ భాగంలో గుబ్బలమంగమ్మ అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో పెదవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2024 జూలైలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోవడంతో భారీ నష్టం సంభవించగా నేడు అది పునరావృతమైంది. కట్ట మరమ్మతుల కోసం నిర్మించిన రింగ్‌బండ్ తెగిపోవడంతో పాటు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివే యడంతో వరద ఒక్కసారిగా దిగువన ఉన్న గ్రామాలపై విరుచుకుపడింది. గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు పరు గులు పెట్టగా మారికొందరు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరినగర్, ఒంటిబండ, గుళ్ల వాయి, సొందేగొల్లగూడెం గ్రామాల్లోకి పెద వాగు వరద పోటెత్తింది. ఈ వరద కార ణంగా వందలాది ఎకరాల్లోని పత్తి, మిర్చి, మొక్కజొన్న,అపరాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. మరో వైపు వేలేరుపాడు, కోయిదా, ప్రధాన రహదారి వర్షాలకు నీట మునగటమే కాకుండా గండ్లు పడ్డాయి. ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కొన్ని రోజుల క్రితమే గోదావరి వరద కారణంగా పంటలు మునిగిపోవడంతో రైతులు మళ్లీ సాగు చేశారు. ఈ వర్షాల కారణంగా మళ్లీ పంటలు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం
కుక్కునూరు: మండలంలో పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటి ల్లింది. పత్తిని తీయడం ఆరంభించారు. మార్కెట్ క్వింటాలు రూ.8,500 వరకు పలికింది. వర్షాలకు పత్తి రాలి తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్లు వస్తాయని రైతులు ఆశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూత, పిందె రాలడంతో ఎకరానికి ఐదు క్వింటాల్లోపే దిగుబడి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మిర్చి తోటల్లోను వర్షపు నీరు నిలవటంతో మొక్కలు కుళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గోదావరి వరదలకు మిర్చి పంట మునగటంతో మళ్లీ రెండోసారి మిర్చి మొక్కలు నాటి రైతులు సాగు చేస్తున్నారు. వీడకుండా కురిసిన వర్షాలకు మిర్చి పంటకు నష్టం ఏర్పడింది.
జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు
జీలుగుమిల్లి: మండలంలో బర్రింకలపాడు వద్ద సుమారు 30 ఎకరాల్లో మిర్చి పంట నీట మునిగింది. తాటియాకులగూడెం వద్ద పొగాకు పంట వరదనీటికి కొట్టుకుపోయింది. లక్ష్మీపురంలో వరదనీటి ఉధృతికి జాతీయ రహదారిపై రెండు కన్నాల తూము వద్ద గండి పండింది. జంగారెడ్డిగూడెం వెళ్లే పలు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ మీదుగా జంగారెడ్డిగూడెం వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. వంకవారిగూడెం, జీ లుగుమిల్లి సమీప కామయ్యపాలెం వాగు ఉధృతికి రహదారులు గండ్లు ప డ్డాయి. గుబ్బలమంగమ్మ గుడి సమీప రామచంద్రాపురం, బుట్టాయగూడెం సరి హద్దు గ్రామం వేపులపాడు గ్రామాల మద్ద రహదారి కొట్టుకుపో వడంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచాయి. పి.నారాయణ పురం వద్ద పోలవరం నిర్వాసితకాలనీ కొరుటూరు వద్ద, బర్రింకపాడు వద్ద ఇటీవల నిర్మించిన ఎన్‌హెచ్ 365 బీబీ రహదారికి గండ్లు పడ్డాయి. జీలుగుమిల్లి మీదుగా వేలేరుపాడు, కుక్కునూరు వెళ్లే ఉద్యోగులకు, జంగా రెడ్డిగూడెం నుంచి మండలంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు మరో మార్గం లేక కొందరు జీలుగుమిల్లిలోనే ఆగాల్సి వచ్చింది. పలుచోట్ల గండ్లు పడటంతో తహసీల్దారు జి.వెంకటేశ్వరావు, ఎస్సై వి.క్రాంతికుమార్‌లు వరద ఉధృతిని సమీక్షించారు. గండ్లు పడ్డ లక్ష్మీపురం జాతీయ రహదారి వద్ద, కామయ్య పాలెం, వంకవారిగూడెం, పి.రాజవరం వాగుల వద్ద రక్ష ణ చర్యలు చేపట్టేందుకు సిబ్బంది పర్యవేక్షణ ఉంచారు.
కొయ్యలగూడెంలో కుండపోత
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం తూర్పు, పడమట కాలు వలు ఉదృతంగా ప్రవహించడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. పొంగుటూరు నుంచి కన్నాయిగూడెం వెళ్లే రహదారిపై శ్రీరాములకట్టు గట్టు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ వరద చేరడంతో ప్రజలు రహదా రిపైనే చేపలు పట్టుకున్నారు.
మల్లుకుంట చెరువుకు గండి
పెదవేగి: మండలంలోని అంకన్నగూడెంలోని మల్లుకుంట చెరువుకు గండిపడి, చెరువులోని నీరంతా బయటకు పోయింది. దీంతో చెరువులోని చేపలన్నీ నీటిపాలయ్యాయని రైతు చిమ్మి రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మురసు తుఫాన్‌తో బుధవారం సా యంత్రం ఎగువ నుంచి భారీగా వరద రావడంతో గ్రామంలోని మల్లుకుంట చెరువుకు గండిపడింది. దీంతో చెరు వులోని చేపలన్నీ నీటి ప్రవాహంతో పాటు బయటకు పోయాయని రైతు దీనంగా చెప్పాడు. బుధవారం సా యంత్రానికి ఎగువనుంచి భారీగా వరద రావడంతో చెరువు నిండి, కట్ట తెగి, నీరంతా బయటకు పోయింది. దీంతో చెరువులోని చేపలన్నీ బయ టకు పోయాయి. 19ఎకరాల విస్తీ ర్ణంలో ఉన్న పంచాయతీ చెరువును వేలంలో పాడుకుని, రూ.18 లక్షలు పెట్టుబడితో చేపలు వేసి, పెంచా నని భారీగా వచ్చిన వరదనీటితో చెరువుకు గండి పడిందని రైతు చిమ్మి రాజేశ్ వాపోయాడు.