Share News

పిల్లలను కనండి..!

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:45 AM

‘ఇద్దరు లేక ముగ్గురు చాలు. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.’ అంటూ జనాభా నియంత్రణకు గతంలో ప్రభుత్వాలు చేపట్టిన నినాదాలివి. తర్వాత కాలంలో ప్రజల జీవన స్థితిగతు ల్లో మార్పులు సంభవించి కుటుంబాలు గడవడమే కష్టంగా వుండడం.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే చట్ట సభల్లో పోటీకి అనర్హులు అంటూ చట్టాలు తేవడంతో జనాభా నియంత్రణ సాధ్యమైంది.

పిల్లలను కనండి..!

జనాభా నియంత్రణ నుంచి వృద్ధి వైపు అడుగులు..

మూడో బిడ్డకు ప్రభుత్వ అండ

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా ఆసక్తి

గతంలో ఇద్దరు వద్దు.. ఒకరే ముద్దు

దశాబ్ద కాలంగా అధిక సంతానంపై తల్లిదండ్రుల్లో అనాసక్తత.. తగ్గిన ఆదాయం.. భారంగా ఖర్చులు

ఇప్పుడు మారుతున్న సమీకరణలు.. ఎక్కువ మంది పిల్లలను కనే వారికి ప్రోత్సాహకాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

‘ఇద్దరు లేక ముగ్గురు చాలు. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.’ అంటూ జనాభా నియంత్రణకు గతంలో ప్రభుత్వాలు చేపట్టిన నినాదాలివి. తర్వాత కాలంలో ప్రజల జీవన స్థితిగతు ల్లో మార్పులు సంభవించి కుటుంబాలు గడవడమే కష్టంగా వుండడం.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే చట్ట సభల్లో పోటీకి అనర్హులు అంటూ చట్టాలు తేవడంతో జనాభా నియంత్రణ సాధ్యమైంది. గడిచిన రెండు దశాబ్దాలుగా తల్లి దండ్రులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోవడం మొదలుపెట్టా రు. ఇప్పటికీ కొందరు దంపతులు పిల్లలకంటే ఉద్యోగం, ఇతర బాధ్యతలపై ఆసక్తి చూపుతున్నారు. సంతానంపై శ్రద్ధ చూపకపోవడంతో యువతరం తగ్గుతూ వస్తోంది. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో వుండగా, ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది. ఈ క్రమంలో జనగణన, తర్వాత నియోజక వర్గాల పునర్విభజన జరు గుతుంది. అప్పుడు పార్లమెంట్‌ స్థానాల సంఖ్య అక్కడ అనూహ్యంగా పెరుగుతోంది. ఇది మనకు భవిష్యత్‌లో అపార నష్టాన్ని చేకూర్చనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఇక్కడ జనాభా పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాగా వున్నప్పుడు ప్రతి తల్లి ఎక్కువ మంది పిల్లలను కోరారు. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనాలంటూ పిలుపు నిచ్చారు. ఇందుకు సం బంధించిన ప్రోత్సాహ కాలను ప్రకటించారు.

జనాభా వృద్ధి అంతంతే

జిల్లాలో జనాభా అంతగా పెరగడం లేదు. ఇతర జిల్లాల నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడిన వారితో కాస్త జనాభా పెరిగింది. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే జనాభా వృద్ధి రేటు అంతగా లేదు. సంఖ్యాపరంగా పెరిగినా ఒక కుటుం బంలో పిల్లలు కనడం తగ్గించేశారు. ఒకరిద్దరితోనే సరిపెడు తూ వస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో జనాభా పెరగ లేదు. ఒక దశలో జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందన్న అంచనాతోనే ప్రభుత్వం మూడో బిడ్డనుకంటే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ప్రకటించింది. జిల్లాలో 2011లో జనాభా లెక్కిం చారు. ఆ తర్వాత మరో పదేళ్లకు అంటే 2021లో జనాభా లెక్కించాలి. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జనగణన నిర్వహించనున్నారు. అందుకు జిల్లా యంత్రాంగం సర్వసిద్ధమైంది. ఏర్పాట్లు చేసుకుంది. డివిజన్‌ల వారీగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. అధికారుల అంచ నా ప్రకారం గడచిన 15 సంవత్సరాలలో జిల్లాలోని జనాభా పెరుగుదల 10 శాతానికి మించి లేదు. అదే యువత సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 17,99,935 మంది అంటే దాదాపు 18 లక్షలు అన్నమాట. తాజాగా 19.68 లక్షల జనాభా ఉంటుందని అనధికారిక అంచ నా. అంటే పది శాతమే పెరిగింది. జిల్లాలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మూడు లక్షల వరకు ఉంది. జిల్లా జనాభాలో ఇది ఆరో వంతు. ఇదే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జనాభాను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో జనాభా తగ్గిపోతుందంటూ సీఎం చంద్రబాబు ముందస్తు అంచనాకు వచ్చారు. కొన్నాళ్లుగా జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టారు. తాజాగా అసెంబ్లీలో సీఎం ప్రకటనతో జిల్లాలో చర్చ సాగుతోంది.

తల్లిదండ్రుల్లోనూ ఆలోచన

ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకున్న తల్లిదండ్రుల్లోనూ ఇప్పుడు కొత్త ఆలోచనలు పట్టుకొస్తున్నాయి. ఆర్థిక స్తోమత పెరుగుతోంది. పిల్లలు ఉన్నత విద్య చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారు. వారైనా పిల్లలు ఎక్కువగా కనాలని కోరుకుంటు న్నారు. పిల్లల కోసం వారు ఉద్యోగం చేసే చోటుకు వెళ్లి నివాసం ఉంటున్నారు. విదేశాల్లో ఉన్నాసరే ఆరు నెలలపాటు అక్కడ ఉండి తిరిగి వస్తున్నారు. అదే దేశంలో ఎక్కడ ఉద్యోగం చేసినా సరే అక్కడకు వెళ్లి తమ పిల్లల సంతా నాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించేవారు. దానివల్ల పిల్లలను ఇంట్లో పెద్ద వారు చూసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉపాధి కోసమని ఇతర ప్రాంతా లకు వెళుతున్నారు. దాంతో ఇంట్లో పెద్దలు తమ పిల్లల సంతానాన్ని చూసుకో వడానికి అక్కడకు వెళుతున్నారు. సొంతూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లల సంతానంపైనా దృష్టి పెడుతున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:45 AM