Share News

మార్కెట్‌ను ముంచెత్తిన

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:37 AM

మార్కెట్లో పచ్చడి మామిడి కాయలు ముచ్చెత్తాయి. గత వారంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో మామిడి కాయలు వచ్చాయి. కొత్తపల్లి మామిడి అత్యధిక ధర పలికింది. నాణ్యత ఆధారంగా ఈ ధరలను వ్యాపారులు నిర్ణయించారు.

మార్కెట్‌ను ముంచెత్తిన
మామిడి

మార్కెట్‌ను ముంచెత్తిన

పచ్చడి మామిడి

కొత్తపల్లి కొబ్బరి 100 కాయలు రూ.2500..

పెద్దరసాలు రూ.1500 నుంచి 2000

చిన్నరసాలు రూ.1000 నుంచి 1500

తాడేపల్లిగూడెం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి):మార్కెట్లో పచ్చడి మామిడి కాయలు ముచ్చెత్తాయి. గత వారంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో మామిడి కాయలు వచ్చాయి. కొత్తపల్లి మామిడి అత్యధిక ధర పలికింది. నాణ్యత ఆధారంగా ఈ ధరలను వ్యాపారులు నిర్ణయించారు. కొత్తపల్లి కొబ్బరి 100 కాయలు రూ.2000 నుంచి 2500 వరకు అమ్మారు. పెద్ద రసాలు రూ.1500 నుంచి 2000, చిన్న రసాలు రూ.1000 నుంచి 1500, సువర్ణరేఖ రూ.800 నుంచి 1000, కలెక్టర్‌ (తోతాపురి) రూ.800 నుంచి 1200 వరకు విక్రయాలు జరిగాయి. అయితే హోల్‌సేల్‌గా మాత్రం కొత్తపల్లి కొబ్బరి 100 కాయలు రూ.1500 నుంచి 1800, పెద్దరసాలు రూ.1200 నుంచి 1500, చిన్నరసాలు రూ.800 నుంచి 1200, సువర్ణరేఖ రూ.500 నుంచి 800, తోతాపురి రూ.600నుంచి 1000 మధ్య విక్రయాలు జరిగాయి.

ఆదరణ తగ్గిన ఆవకాయ..

సామాన్యుడు 100 మామిడి కాయలతో పచ్చడి పడిపడితే సుమారు రూ.5వేలు ఖర్చు అవుతోంది. రూ. 2762 కేవలం పచ్చడిలో వేసే సరుకు లకు వెచ్చించాల్సి వస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే వెల్లుల్లి, వేరుసెనగ నూనె ధరలు మాత్రమే పెరిగాయి. 100కాయలతో పచ్చడి పట్టాలంటే 2కిలోల ఆవాలు(రూ.240), మెంతులు అరకిలో(రూ.65), వెల్లుల్లి కిలో రూ.220, టాటాసాల్ట్‌ 4కిలోలు (కిలో రూ.28) రూ.112, నంబర్‌ వన్‌ వేరుసెనగ నూనె 4కిలోలు (కిలో రూ.185) రూ.925, నంబర్‌ వన్‌ కారం 2కిలో(కిలో రూ.600) రూ.1200 ఖర్చుఅవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మామిడి కాయలు ముక్కలుగా నరకాలి అంటే 100 కాయలకు సైజను బట్టి రూ.300 నుంచి 400 తీసుకుంటున్నారు. ఉదాహరణకు కొత్తపల్లి కొబ్బరి 100 కాయలతో పచ్చడి పట్టాలంటే కాయల ఖరీదు సుమారు రూ.2000, పచ్చడిలో వేసే ఖర్చులు రూ.2762, ముక్కలు కొట్టడానికి రూ.300 కలుపుకుంటే సుమారు రూ.5వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. గ్యాస్‌ ప్రాబ్లమ్‌, ఇతర ఆరోగ్య సమస్యలతో పచ్చడికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 100కాయలతో పచ్చడి పట్టేవారు 20 కాయల నుంచి 50 కాయలతో సరిపెట్టేసుకుంటున్నారు.

బెంగళూరుకు ఆవకాయ ఎగుమతి

జిల్లా నుంచే బెంగళూరు, చెన్నయ్‌, కేరళం వంటి ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఆర్డర్లపై ఆవకాయ ఎగుమతి చేస్తుంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉసులమర్రు జుత్తిక, కొమరవరం, పెనమంట్ర, కాకరపర్రు, మార్టేర్‌ ప్రాంతాల నుంచి ఎగుమతి అవుతుంటాయి. కిలో మొదలుకుని టన్నుల కొద్ది పచ్చళ్లు రెడీ అవుతుంటాయి. తణకు, నర్సాపురం, భీమవరం వంటి పట్టణాల్లో చిన్న చిన్న హోమ్‌ ఇండస్ర్టీలు, యూనిట్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ కొరియర్‌ సర్వీస్‌ ద్వారా పచ్చళ్లను పంపిణీ చేస్తుంటారు. వింటే భారతమే వినాలి... కొంటే ఉసులుమర్రు ఊరగాయే కానాలని సామెత కూడా ఒకటి వచ్చింది. ఇక్కడ పట్టే ఆవకాయ పచ్చడికి అంత ఆదరణ ఉంది. ఈ గ్రామం నుంచి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారంటే అర్దమవుతుంది. ఆ గ్రామం బ్రాండ్‌ ఇమేజ్‌.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి):మార్కెట్లో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. అదే బాటలో కూరగాయలు ఉన్నాయి. ఉల్లి ధర గతవారంతో పోల్చుకుంటే వ్యత్యాసం లేదు. హోల్‌సేల్‌గా క్వింటా ఉల్లి రూ.1000 నుంచి 1500 వరకు ఉంది. మహారాష్ట్ర నుంచి 10 లారీల్లో తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 250 టన్నుల ఉల్లి వచ్చింది. రిటైల్‌ వ్యాపారులు నాణ్యమైన ఉల్లి రూ.100కు 5కిలోలు ఇస్తున్నారు. మధ్యరకం ఉల్లి రూ.100కు 6 కిలోలు ఇస్తున్నారు. ఆటోల్లో తిరిగి విక్రయించే వారు మధ్యరకం, నాసిరకం ఉల్లి కలిపి రూ.100కు 7కిలోలు ఇస్తున్నారు. ఇక కూరగాయల ధరల్లో కూడా పెద్ద వ్యత్యాసం లేదు. తెల్లవంకాయలు, నల్లవంకాయయలు ఈనెల కిలో రూ.60కు, బీరకాయలు రూ.60, బెండ రూ.40, దొండ రూ.40, దోస రూ.30, క్యారరెట్‌, బీట్‌రూట్‌ రూ.50, కాప్సికమ్‌ రూ.80, చిక్కుడు రూ.100 కాకర రూ.40, మిర్చ రూ.40, కంద రూ.80, ముల్లంగి రూ.80, టమాటా రూ.40,బంగాళా దుంప రూ.30, అరటి జతా రూ.15, మూడ కాయలు రూ.20, పొట్ల కాయ రూ.30 నుంచి 40, మునగ కాడ జత రూ.20కు అమ్ముతున్నారు.

మార్కెట్లో నిలకడగా ఉల్లి ధరలు

అదే బాటలో కూరగాయలు

Updated Date - Apr 27 , 2026 | 12:37 AM