మొగల్తూరు మామిడీలా
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:59 PM
ఎంతో ప్రసిద్ధి చెందిన మొగల్తూరు మామిడి దిగుబడి ఈ ఏడాది ప్రశ్నార్ధకంగా మారింది.
మంచు ప్రభావంతో రాలిన పూత.. తగ్గుతున్న దిగుబడి
మొగల్తూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి):ఎంతో ప్రసిద్ధి చెందిన మొగల్తూరు మామిడి దిగుబడి ఈ ఏడాది ప్రశ్నార్ధకంగా మారింది. ఈఫలసా యంపై రైతులు, కౌలు రైతులు, వ్యాపారులు ఇలా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈఏడాది వాతావరణ మార్పులు, మంచు ప్రభావం పంటపై చూపడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి లేదు. మండలంలోని మొగల్తూరు, రామన్నపాలెం, కెపిపాలెం, పేరుపాలెం, ముత్యాలపల్లి, మోడి గ్రామాల్లో అంతర్‌పంటగానూ తోటలుగాను సుమారు 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో మామిడిపూత ఆశాజనకంగా ఉండటంతో ప్రతి ఏటా తోటలు కొనుగోలు చేసి ఫలసాయం అమ్ముకునే కౌలు రైతులు కూడా భారీగా పెట్టు బడి పెట్టారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పలు మార్లు భారీగా మంచుకు రియడంతో పూసిన పూత మాడి రాలిపోయింది. ఆసమయంలో పూత రాలకుండా నిలబడేం దుకు వేలాది రూపాయలు వెచ్చించి క్రిమిసం హారక మందులు పిచికారి చేశారు. ఎన్ని మందులు వాడినా ఫలితం రాకపోవడంతో ఫిబ్రవరి నెలాఖరుకు పిందెలతో రావల్సిన దిగుబడి మార్చి నెల పూర్తి అవుతున్నా కొద్ది మేర ఎకరాల్లో మాత్రమే పంట దిగుబడి ప్రారంభమైంది.. ప్రతి ఏటా ఉగాదికి మామిడి కాయలు అందుబాటులోకి వచ్చేవి. ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం పచ్చడి మామిడి కాయలు కూడా అందుబాటులోకి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.