Share News

గురుకుల విద్యార్థి ఆత్మహత్య ఘటనపై 19న మెజిస్టీరియల్‌ విచారణ

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:21 AM

పెదవేగి లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాల యంలో ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిత్‌ (15) మృతిపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారని ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌ తెలిపా రు.

 గురుకుల విద్యార్థి ఆత్మహత్య ఘటనపై 19న మెజిస్టీరియల్‌ విచారణ

పెదవేగి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పెదవేగి లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాల యంలో ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిత్‌ (15) మృతిపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారని ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌ తెలిపా రు. తమ కుమారుడి మృతిపై అనుమానం ఉం దని, సమగ్రంగా దర్యాప్తు చేయించి, న్యాయం చేయాలంటూ భీమడోలు మండలం పూళ్లకు చెందిన ఈపిచర్ల రమేష్‌, అతని భార్య అదేరోజు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. దీనిపై కలెక్టర్‌ మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ గురువారం ఏలూరు రెవెన్యూ డివిజన ల్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచార ణ జరుగుతుందన్నారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలిసిన వారు హాజరు కావాలన్నారు. ఆర్డీవో సమక్షంలో ఈ విచారణ జరగనుంది.

Updated Date - Feb 15 , 2026 | 12:21 AM