Share News

వేలం.. పొర‘పాట’!

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:20 AM

పశ్చిమ గోదావరి నరసాపురం (మాధవాయిపాలెం)–అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవు నిర్వహణ బాధ్యతలను టేకిశెట్టిపాలేనికి చెందిన విఘ్నేశ్వర శ్యాండ్‌ క్వారీ అండ్‌ సొసైటీ దక్కించుకుంది.

వేలం.. పొర‘పాట’!
వేలం నిర్వహిస్తున్న మండల పరిషత్‌ ఆధికారులు

రూ.11 లక్షలు హాంఫట్‌ !

రూ.3.70 కోట్లకు మాధవాయిపాలెం

రేవు పాట ఖరారు

పొరపాటున హెచ్చుకు వేలం పాట

రద్దు కోరినా అంగీకరించని అధికారులు

నరసాపురం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి నరసాపురం (మాధవాయిపాలెం)–అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవు నిర్వహణ బాధ్యతలను టేకిశెట్టిపాలేనికి చెందిన విఘ్నేశ్వర శ్యాండ్‌ క్వారీ అండ్‌ సొసైటీ దక్కించుకుంది. అయితే వేలం సమయంలో అంకెల్లో జరిగిన పొరపాటు కారణంగా పాటదారుడు రూ.10 లక్షల 99 వేలు పొగొట్టుకోవాల్సి వచ్చింది. వివరాలివి.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ రేవు వేలం పాటను సోమవారం నరసాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో భారీ భద్రత మధ్య నిర్వహిం చారు. పాట ప్రారంభ ధర రూ.3.59 కోట్లుగా నిర్ణయిం చారు. ధరావత్తు చెల్లించిన ఇద్దరు పాటదారులను, అధి కారులను, జేఏసీ సభ్యులను మాత్రమే అనుమ తించారు. బహిరంగ వేలంలో నరసాపురం ప్రాఽథమిక సొసైటీకి చెందిన కార్యదర్శి రూ.1000కి బదులు ఒక్క సారిగా రూ.11 లక్షలకు హెచ్చుకు పాడాడు. అంటే పాట రూ.10 లక్షల 99 వేలు హెచ్చుకు పాడాడు. ఈ పాట దారుడు పాడగానే.. ఆ వెంటనే విఘ్నేశ్వర సొసైటీ అధ్యక్షుడు రూ.1000 పెంచి రూ.3 కోట్ల 70 లక్షలకు పాడడంతో మరోమాటకు తావులేకుండా అధికారులు పాటను ఖరారు చేశారు. తర్వాత పొరపాటున వెయ్యి పెంచుదామని 11 లక్షలు పెంచేశామని, పాటను రద్దు చేయాలని ఎంత బతిమాలినా అధికారులు ఒప్పుకోలేదు. అప్పటికే రెండో పాటదారుడు పాడేయడంతో అఽధికారులు నో చెప్పారు. కాగా.. సీక్రెట్‌ టెండర్లలో ఈ ఇద్దరు పాటదారులూ రూ.3.61 కోట్లకు మించి వేయలేదు. ఒకరు 3,60,0999కి, ఇంకొకరు రూ.3,60,0333 మాత్రమే కోడ్‌ చేశారు. అంటే వీరిద్దరూ సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు వేసేందుకు వచ్చినా..మొదటి పాటదారుడు రూ.11 లక్షలు పెంచ డంతో రెండో వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు.

Updated Date - Mar 31 , 2026 | 12:20 AM