Share News

వైభవంగా మద్దిలో పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:44 AM

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడోరోజు పూజా కార్యక్ర మాలు వైభవంగా నిర్వహిం చారు

వైభవంగా మద్దిలో పవిత్రోత్సవాలు
మద్ది క్షేత్రంలో పవిత్రోత్సవాలు..

జంగారెడ్డిగూడెం రూరల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడోరోజు పూజా కార్యక్ర మాలు వైభవంగా నిర్వహిం చారు. ఉదయం, సాయంత్రం ఆరు గంటల సమయంలో విశ్వక్సేన పూజ, సప్తకలశ స్నపనం, పవిత్ర ఆరోహణ, శాంతి హోమాలు, చతుర్వేదాధ్యయనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశామని చైర్మన్‌ రాజాన సత్యనారాయణ, ఈవో చందన తెలిపారు.

పాలకొల్లు అష్టభుజలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో..

పాలకొల్లు అర్బన్‌ : పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆల యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు మూడోరోజు మంగళవారం స్వామివారి ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. అళ్వార్లకు తిరుమంజనోత్సవం నిర్వహించి అలంకరించారు. ఈ కార్యక్రమాలను ప్రధానార్చకులు వెంకట పవన్‌ కుమారాచార్యులు, అర్చకులు పూలపల్లి కృష్ణమాచార్యులు, రంగనాఽథాచార్యులు, పండితులు ప్రత్యేక వేదపఠనం గావించారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం గావించారు. ఈవో బీవీవీ సత్యనారాయణ శంకర్‌, సిబ్బం ది, చైర్మన్‌ రేపాక ప్రవీణ్‌ భాను, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి పవిత్రల సమర్పణ గావించారు.

నేటి నుంచి.. ఏలూరు శ్రీవారి ఆలయంలో

ఏలూరు కార్పొరేషన్‌ : ఏలూరు రామచంద్రరా వుపేట వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈనెల 23 నుంచి 26 వరకు 25వ వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పాలడుగు వెంకట రమాదేవి, ఈవో నల్లూరి సతీష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంట లకు పవిత్రోత్సవాలు ప్రారంభిస్తామని, 24న ఉదయం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శ్రీవారికి పవిత్ర తోరణాలు సమర్పిస్తా రన్నారు. 25న అష్టోత్తర శత కలశాభిషేకం, 26న భూవరాహేష్టి, శ్రీవారికి గరుడసేవ, సహస్ర దీపాలం కరణ, ఊంజల్‌ సేవ కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

Updated Date - Sep 23 , 2026 | 12:44 AM