మద్ది ఆంజనేయుడికి అష్టోత్తర పూజలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:28 AM
గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
జంగారెడ్డిగూడెంరూరల్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ 108 ప్రదక్షిణలు, తలనీలాలు, వాహనపూజలు, అన్నప్రాసనలతో భక్తులు మొక్కులు తీర్చుకు న్నారు. పలు సేవల రూపంలో దేవస్థానానికి రూ.2,72,533 ఆదాయం వచ్చిం దని, నిత్యాన్నదాన సత్రంలో 2,473 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిం చినట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ధూళిపాళ్ల సూర్య చంద్ర వెంకట ప్రభాకరరావు, దూనబోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, తిరుమలశెట్టి నాగవరలక్ష్మిఅనీల, ఆరుగొల్లు సావిత్రి పాల్గొన్నారు.