Share News

వైభవంగా మదన గోపాలస్వామి కల్యాణం

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:29 AM

బల్లిపాడు మదన గోపాలస్వామి కల్యాణం వైభవంగా శుక్రవారం నిర్వహించారు. నరసాపురానికి చెందిన పెద్దింటి అనిల్‌ కుమార్‌ ఆచార్యులు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణతులసి దంప తులు స్వామి వారి కల్యాణం జరిపారు.

వైభవంగా మదన గోపాలస్వామి కల్యాణం
దువ్వ వేణుగోపాలస్వామి రథోత్సవం

అత్తిలి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): బల్లిపాడు మదన గోపాలస్వామి కల్యాణం వైభవంగా శుక్రవారం నిర్వహించారు. నరసాపురానికి చెందిన పెద్దింటి అనిల్‌ కుమార్‌ ఆచార్యులు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణతులసి దంప తులు స్వామి వారి కల్యాణం జరిపారు. ఈ సందర్భంగా సవరం కృష్ణమూర్తి దంపతులు, యాళ్ళ శ్రీరాములు దంపతులు, తిరుపతి శ్రీనివాసు దంపతులు, ప్రగడ శ్యాంప్రసాద్‌ దంపతులు, ముత్యాల రామకృష్ణ దంపతులు స్వామికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు బహూకరించారు. వేలాది మంది భక్తులు కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ వారిచే భారీ అన్నసమారాధన నిర్వహించారు.

ఘనంగా అత్తిలి, దువ్వల్లో రథోత్సవాలు

అత్తిలి/తణుకు రూరల్‌ : అత్తిలి మదన గోపాలస్వామి కల్యాణోత్సవాలు, తణుకు రూరల్‌ మండలం దువ్వ గ్రామంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా శుక్రవారం కన్నుల పండువగా రథోత్సవాలు నిర్వహించారు. పలు బ్యాండ్‌ వాయిద్యాలు, సన్నాయి మేళాలతో బాణసంచా కాలుస్తూ ఊరేగించారు. అత్తిలిలో ఆకుల రామచంద్రరావు సహకా రంతో కోలాట భజన కార్యక్రమాలు నిర్వహించారు. బాడిగ వెంకట చిట్టిబాబు దంపతులచే రథానికి పుష్పాలంకరణ జరిపారు. అత్తిలి ఎస్‌ఐ పి.ప్రేమరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ గారపాటి బాబ్జీ, ఈవో లింగంపల్లి లోకనాఽథ్‌ శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు. సాయంత్రం రామాయణ ప్రవచనం, సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకం నిర్వహించారు.

Updated Date - Feb 28 , 2026 | 12:29 AM