Share News

అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలెండర్లు స్వాధీనం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:41 AM

వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన 26 గ్యాస్‌ బండలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలెండర్లు స్వాధీనం
నిడమర్రు, నరసాపురంలో స్వాధీనం చేసుకున్న గ్యాస్‌ సిలెండర్లు

అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలెండర్లు స్వాధీనం

నిడమర్రు/నరసాపురం టౌన్‌/పెదపాడు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన 26 గ్యాస్‌ బండలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన బలే ఏడుకొండలు ఇంటి వద్ద 12 గ్యాస్‌ సిలెండర్లు నిల్వ ఉంచినట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసినట్టు ఏలూరు జిల్లా విజిలెన్స్‌ ఎస్‌.పి కె.నాగేశ్వరరావు తెలిపారు. తెలిసిన వారి ఇళ్ల వద్ద గ్యాస్‌ బండలు కొనుగోలు చేసి వ్యాపారులకు రూ.100 లాభంతో విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నా రు. రూ.37,659 విలువ కలిగిన 12 సబ్సిడీ సిలెండర్లను సీజ్‌ చేసి ఏడు కొండలుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నరసాపురం పట్టణంలోని ఓ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 14గ్యాస్‌ సిలెండర్లను గురువారం రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ముందస్తు సమాచారంలో తహసీల్దార్‌ ఐవీవీ సత్యనారాయణ, సివిల్‌ సప్లై డీటీ మహేష్‌లు దాడులు చేశారు. ఇంటి ప్రాంగణంలో అనుమతులు లేకుండా వీటిని ఉంచినట్లు గుర్తించారు. వెంటనే వాటిని సీజ్‌ చేసినట్లు తహసీ ల్దార్‌ తెలిపారు. తోకలపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో విజిలెన్స్‌ తసీల్దార్‌ బి.కన్యాకుమారి, ఎస్‌.ఐ. రంజిత్‌ కుమార్‌, సిఎస్‌డిటి ఎస్‌.కె. జరీనా పాల్గొన్నారు.

గ్యాస్‌ సరఫరాపై వదంతులు నమ్మొద్దు : పెదపాడు తహసీల్దార్‌

ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరా కొరత ఉందంటూ వ్యాప్తిస్తున్న వదంతులను గృహా వినియోగదారులు నమ్మవద్దని పెదపాడు తహసీల్దారు కృష్ణజ్యోతి తెలిపారు. ఎల్‌పీజీ గ్యాస్‌పై వస్తున్న వదంతుల నేపథ్యంలో పెదపాడులోని సాయిబాలాజీ ఇండేన్‌ గ్యాస్‌ గొడౌన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొడౌన్‌లో స్టాకు, రికా ర్డులు పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు లేవని, నిరంతరం పంపిణీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వీఆర్వో నరసింహ పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:41 AM