Share News

అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది లారీల సీజ్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:38 AM

మండ లంలోని చిన్నవారిగూడెంలో ఉన్న ప్రధాన చెరువు నుంచి సోమవారం రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 లారీలను పోలీసులు సీజ్‌ చేశారు. యథేచ్ఛగా మట్టితరలిస్తున్నా రంటూ ఆరోపిస్తూ గ్రామస్థులు అడ్డుకున్నారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది లారీల సీజ్‌
8 లారీలు

అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది లారీల సీజ్‌

జంగారెడ్డిగూడెం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండ లంలోని చిన్నవారిగూడెంలో ఉన్న ప్రధాన చెరువు నుంచి సోమవారం రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 లారీలను పోలీసులు సీజ్‌ చేశారు. యథేచ్ఛగా మట్టితరలిస్తున్నా రంటూ ఆరోపిస్తూ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు చేరవేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది లారీలను సీజ్‌ చేసి జంగారెడ్డిగూడెం స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తహసీల్దార్‌ కె.స్లీవజోజి ఒక్కొక్క టిప్పర్‌కు రూ.7,500 చొప్పున జరిమానాలు విధించినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 11 , 2026 | 12:38 AM