Share News

వేర్వేరు ప్రాంతాల్లో రెండు లారీలు బోల్తా

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:13 AM

మండల పరిధి లోని లంకాలపల్లి గ్రామ శివారుల్లో ఆదివారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తాపడింది.

వేర్వేరు ప్రాంతాల్లో రెండు లారీలు బోల్తా

బోల్తాపడిన గ్యాస్‌ సిలిండర్ల లారీ

కుక్కునూరు, అక్టోబరు 4 (ఆంధ్ర జ్యోతి): మండల పరిధి లోని లంకాలపల్లి గ్రామ శివారుల్లో ఆదివారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. గోకవరం నుంచి వయా కుక్కునూరు మీదుగా చింతూరు వైపు గ్యాస్‌ సిలిండర్ల లోడుతో లారీ వెళ్తుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా సమీపంలో వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూలీలు సమీపంలో పని చేస్తుండటం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ లోడు లారీ బోల్తా

జీలుగుమిల్లి, అక్టో బరు 4(ఆంధ్రజ్యోతి): సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ లోడుతో వెళుతున్న ట్యాంకర్‌ లారీ బోల్తా పడిన సంఘటన దర్భగూడెం శివారు జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. కొవ్వూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ లోడు లారీ ఆదివారం ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి జాతీయ రహదారి పక్కన తుప్పల్లోకి దూసుకెళ్లి ఆగింది. ప్రమాద స్థలం వద్దకు పండువారిగూడెం, రమణక్కపేట గ్రామాల సమీప గిరిజనులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్‌ క్లీనర్‌లకు ఎటువంటి ప్రమాదం జరక్కపోటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:13 AM