శ్రీవారి ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కింపు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:24 AM
ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 16 రోజులకు జరిగిన లెక్కింపులో నగదురూపేణా రూ.2.09 కోట్లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు.
ద్వారకాతిరుమల, జనవరి 8(ఆంధ్రజ్యోతి):ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 16 రోజులకు జరిగిన లెక్కింపులో నగదురూపేణా రూ.2.09 కోట్లు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు. స్థానిక ప్రమోద కల్యాణ మండప ఆవరణలో గురువారం అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ హుండీల లెక్కింపును నిర్వహిం చారు. హుండీల ద్వారా లభించిన రూ.2,09,40,260 నగదుతోపాటుగా భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 79 గ్రాముల బంగారం, 3.552 కేజీల వెండి లభించాయన్నారు. రద్దయిన పాతనోట్లు రూ.500 (5), రూ.1000(1), 2000(1)తో పాటుగా విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. శ్రీవారి హుండీల ద్వారా రోజుకు సగటున రూ.13.08 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో వివరించారు.
కాళ్లకూరు వెంకన్న ఆలయంలో..
కాళ్ల, జనవరి 8(ఆంధ్రజ్యోతి):కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆల యంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం హుండీల సొమ్ము లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా 90 రోజులకుగాను హుండీ లెక్కించగా 20 లక్షల 31 వేల 838 రూపాయలు వచ్చాయని దేవస్థానం ఈవో ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు. దేవదాయ, ధర్మదాయ శాఖ ఆకివీడు సమూహ దేవాలయాల ఈవో అల్లూరి సత్యనారాయణరాజు సమక్షంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది హుండీలు తెరిచి లెక్కించినట్లు ఈవో స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.