Share News

మార్మోగిన గోవింద నామస్మరణ

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:51 AM

గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు కావడంతో శనివారం ఆల యం భక్తజనులతో పోటెత్తింది.

మార్మోగిన గోవింద నామస్మరణ
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ అనివేటి మండప ఆవరణలో భక్తుల సందడి.

ద్వారకాతిరుమల, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు కావడంతో శనివారం ఆల యం భక్తజనులతో పోటెత్తింది. దాదాపు 20వేల మంది వరకూ భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుని క్యూలైన్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి చూశారు. క్షేత్రపరిసరాలు సందడిగా మారాయి. వారంతా గంటల తరబడి వేచి ఉండి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

రేపటి నుంచి కుంకుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు

శ్రీవారి క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయ 23వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో వి. త్రినాథరావు తెలిపారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచన, తదితర పూజలు. 23న ఉదయం సర్వతో భద్ర మండలి ఆరాధన, యంత్ర ఉద్దారణ విహిత దేవత మండపా రాధనలు, హోమాలు. జరుగన్నాయి. 24న ఉదయం మూలవరులకు, ఉత్సవమూర్తికి నవకలశ స్నపన, శ్రీచక్రార్చన, హోమాలు, మహాపూర్ణాహుతి పండితసత్కారం జరుగుతాయన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:51 AM