Share News

వినాయక నిమజ్జనానికి పటిష్టమైన భద్రత

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:33 AM

జిల్లాలో వినాయక నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ అధికారులను ఆదేశించారు.

వినాయక నిమజ్జనానికి పటిష్టమైన భద్రత

ఏలూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వినాయక నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా ఎస్పీ కిశోర్‌తో కలిసి కలెక్టరేట్‌ నుంచి మంగళవారం సంబంధిత శాఖల జిల్లా అధికా రులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సమ యంలో ముఖ్యంగా నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. డివిజినల్‌ స్థాయి రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించి గ్రామ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసి నిమజ్జన సమయంలో నీటి ప్రమాదాలు, బాణసంచా, విద్యుదాఘాతం వంటి ప్రమాదాలు చోటు పెద్ద ఘాట్ల వద్ద నీటిలోకి యువతను అనుమతించకుండా ఎక్స్‌కవేటర్ల ద్వారా నిమజ్జనాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ కిశోర్‌ మాట్లాడుతూ నిమజ్జన సమయంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఘాట్ల వద్ద లైటింగ్‌ ఏర్పాట్లతో పాటు నిమజ్జన ప్రదేశంలో విద్యుత్‌ సరఫరాలో అంతరా యం లేకుండా చూడాలన్నారు. నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, ఆర్డీవో లక్ష్మీప్ర సన్న, రమణ, డీఎస్పీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:33 AM