Share News

అభయాంజనేయస్వామికి, శోభనాచలస్వామికి.. లోకాయుక్త జస్టిస్‌ మల్లికార్జునరావు పూజలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:52 PM

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా అప్పనవీడులోని అభయాంజనేయస్వామిని ఆదివారం దర్శించుకున్నారు.

అభయాంజనేయస్వామికి, శోభనాచలస్వామికి..  లోకాయుక్త జస్టిస్‌ మల్లికార్జునరావు పూజలు
అప్పనవీడులో స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు

పెదపాడు/ఆగిరిపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా అప్పనవీడులోని అభయాంజనేయస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లికార్జునరావుకు ఆలయ చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.తారకేశ్వరరావు, పాలకమండలి సభ్యులు, భక్తులు పాలొ ్గన్నారు. అదేవిధంగా ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామిని జస్టిస్‌ మల్లికార్జునరావు దంపతులు ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహిం చారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించి స్వామి ప్రసాదం అందజేశారు.డీటీ పవన్‌కుమార్‌, ఈవో సాయి, ఎస్‌ఐ హెచ్‌ నాగరాజు, వీఆర్వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:53 PM