Share News

పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపిన కొండరెడ్లు

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:28 AM

లంకపాకల (కొయిదా) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో తరగతులను కుదింపును నిరసిస్తూ బుధవారం మాజీ సర్పంచ్‌ కారం లక్ష్మీ, ఉప సర్పంచ్‌ చింతల కృష్ణ పాఠ శాల గేటుకు తాళం వేసి ఉపాధ్యాయులు లోపలకు వెళ్లకుండా నిలుపుదల చేసి విద్యాక్థులు, వారి తల్లిదండ్రు లతో కలిసి నిరసన తెలిపారు.

పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపిన కొండరెడ్లు
లంకపాకల ఆశ్రమ పాఠశాల గేటుకు తాళం వేస్తున్న మాజీ సర్పంచ్‌ కారం లక్ష్మీ, గిరిజన మహిళలు

బుట్టాయగూడెం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): లంకపాకల (కొయిదా) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో తరగతులను కుదింపును నిరసిస్తూ బుధవారం మాజీ సర్పంచ్‌ కారం లక్ష్మీ, ఉప సర్పంచ్‌ చింతల కృష్ణ పాఠ శాల గేటుకు తాళం వేసి ఉపాధ్యాయులు లోపలకు వెళ్లకుండా నిలుపుదల చేసి విద్యాక్థులు, వారి తల్లిదండ్రు లతో కలిసి నిరసన తెలిపారు. నాయకులు కారం రాఘవ, బన్నె వినోద్‌ మాట్లాడుతూ రేషనలైజేషన్‌ పేరుతో పాఠ శాలలను కుదిస్తూ గిరిజనులను విద్యకు దూరం చేస్తు న్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు వల్ల గిరిజన విద్యార్థులు వసతిగృహం సదుపాయాలను, ఉద్యోగ అవకాశాలను, హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. గిరిజనులు విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే పాత పద్ధతిలోనే 3 నుంచి 10 వరకు తరగతులను నిర్వహిం చాలని డిమాండ్‌ చేశారు. న్యూడెమోక్రసీ ఎంపీటీసీ కొవ్వాసు దోవిందరాజు, కరకాల పద్మ, గోగుల చంటి, జి.కల్యాణి, చింతల చెల్లమ్మ, కె.సుశీల, కె.రమాదేవి, కె.చిన్నారెడ్డి కొండరెడ్డి గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:28 AM