సాఫీగా.. సజావుగా..
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:25 AM
జిల్లాలో మండల పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కూటమికే ఏకపక్షమ య్యాయి. అనుకున్నట్టుగానే ఎన్నిక లాంఛన ప్రాయమైంది.
మండల పరిషత్ ఎన్నికలు ప్రశాంతం
కూటమికే ఏకపక్షం... తెలుగుదేశానికి 14 , జనసేనకు ఆరు
ఉపాధ్యక్ష పదవులకూ ఎన్నిక పూర్తి
బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాలు
...........................
జడ్పీపై వీడిన ఉత్కంఠ
చైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజుకు ఛాన్స్
వైస్ చైర్మన్‌గా నాగేశ్వరరావు
నేడు ఎన్నిక .. ఏర్పాట్లు పూర్తి
(భీమవరం–ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మండల పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కూటమికే ఏకపక్షమ య్యాయి. అనుకున్నట్టుగానే ఎన్నిక లాంఛన ప్రాయమైంది. జిల్లాలోని 20 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఎక్కడా అవాంతరాలు లేవు. ఉపాధ్యక్ష ఎన్నిక కూడా పూర్తయ్యింది. పాలక వర్గాలు భాధ్యతలు స్వీకరించాయి. ఇకపై మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. పాలక వర్గాలు పాలన కొనసాగనుంది. మండల పరిషత్ కార్యాలయా ల్లోనే ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని 20 మండల పరిషత్‌లలో టీడీపీ 14 మండల పరిషత్ అధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. జనసేనకు ఆరు మండల పరిషత్‌లు దక్కాయి. భీమవరం రూరల్, ఉండి, పాలకోడేరు, కాళ్ల, తాడేపల్లిగూడెం రూరల్, తణుకు రూరల్, అత్తిలి, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర, ఆచంట, పాలకొల్లు రూరల్, యలమంచిలి, నర్సాపురం మండల పరిషత్ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. వీరవాసరం, ఆకివీడు, గణపవరం, పెంటపాడు, ఇరగవరం, మొగల్తూరు మండల పరిషత్ అధ్యక్ష పదవులు జనసేన కైవసం చేసుకుంది.ఎక్కడా కూటమిలో విభేధాలు లేవు. ముందుగానే నిర్ణయించిన మేరకు అధ్యక్షులుగా ఎంపీటీసీలు ఎన్నుకున్నారు. ఎంపీపీ ఎన్నికకకు అభ్యర్థులు ర్యాలీగా విచ్చేశారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ కూటమి సందడి కనిపించింది. వైసీపీ జాడ ఎక్కడా కానరాలేదు. పెనుమంట్రలో ఎనిమిది ఎంపిటిసిలు గెలిచినా సరే తొమ్మిది స్థానాలున్న కూటమి అక్కడ మండల పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకుంది. కూటమి ఎంపీటీసీలు ఎక్కడా బెసగలేదు. తొలుత నిర్ణయించిన మేరకు తెలుగుదేశం తరుపున ఎంపీపీ అభ్యర్థి గెలుపొందారు.
ఉపాధ్యక్ష పదవులు ఏకగ్రీవమే
ఉపాధ్యక్ష పదవులు కూడా ఏకగ్రీవ మయ్యాయి. కూటమి ఎంపీటీసీలు ప్రతిపాదిం చిన వారే ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ప్రతి మండల పరిషత్‌లోనూ ఒక ఉపాధ్యక్షున్ని ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీకి 10, జనసేనకు 9, బీజేపీకి ఒక ఉపాధ్యక్ష పదవిని కేటాయించారు. తెలుగుదేశం నుంచి వీరవాసరం, కాళ్ల, ఆకివీడు రూరల్, పెంటపాడు, ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, యలమంచిలి, మొగల్తూరు, గణపవరం మండలాల నుంచి ఎన్నికవగా జనసేన నుంచి భీమవరం రూరల్, తాడేపల్లిగూడెం, అత్తిలి, ఉండి, తణుకు రూరల్, పెనుగొండ, పాలకోడేరు, నర్సాపురం రూరల్, పాలకొల్లు రూరల్ నుంచి మండలాల నుంచి ఉపాఽధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. పోడూరు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి బీజేపీకి వరించింది. కోఆప్షన్ సభ్యులను తదుపరి సమా వేశంలో ఎన్నుకోనున్నారు. మొత్తంపైన మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి కావ డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
జడ్పీ చైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖరారైంది. నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి జిల్లా పరిషత్ చైర్మన్‌ను కేటాయించారు. గణపవరం జడ్పీటీసీగా తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఇందుకూరి రామకృష్ణంరాజుకు అవకాశం లభించింది. వైస్‌చైర్మన్‌గా అత్తిలి జడ్పీటీసీ సిరగాని నాగేశ్వరావు ఎన్నిక కానున్నారు. వైస్‌చైర్మన్ పదవి కూడా టీడీపీకే ఇచ్చారు. గురువారం రాత్రి లేటుగా దీనిపై స్పష్టత వచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికను శుక్రవారం నిర్వహించను న్నారు. ఇప్పటికే దీనిపై షెడ్యూల్ విడుదల చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రం తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నిక కోసం భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ నాగరాణి ఎన్నికల అధికారి బాధ్యతలు నిర్వహించ నున్నారు. జడ్పీటీసీ లంతా శుక్రవారమే బాధ్యతలు తీసుకుంటారు. ఎన్నిక అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయించారు. జిల్లాలో ఐదు మండలాల్లోనే జనరల్ కేటగిరీలో పోటీ చేసిన అభ్య ర్థులున్నారు. జనసేన నుంచి ఉండి జడ్పీటీసీగా గెలుపొందిన పీవీఎల్ నరసింహరాజు చైర్మన్ పదవిని ఆశించారు. అందులో భాగంగానే ఉండి నుంచి బరిలో దిగారు. జిల్లాలో 20 జడ్పీటీసీలు కూటమి వశమయ్యాయి. చైర్మన్ పదవిపైనే చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం కోసం అంతా ఎదురు చూశారు. జిల్లాలోని కూటమి ప్రజా ప్రతి నిధులు, ఇన్‌ఛార్జ్‌ల అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకున్నారు. చివరకు తెలుగుదేశం పార్టీకే పదవి వరించింది. రామకృష్ణంరాజు గణపవరం టీడీపీ అధ్యక్షునిగా వ్యవహరిస్తు న్నారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా ఆయన టీడీపీలో ఉన్నారు. ఈయన తండ్రి సుబ్బరాజు గణపవరం తొలి ఎంపీపీగా చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. వీరి కుటుంబం మొదటి నుంచీ టీడీపీలో కొనసాగుతున్నారు.