స్థానిక పోరుకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:11 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వ డంతో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, జిల్లా పరిషత్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.
త్వరలో రిజర్వేషన్లపై జీవో విడుదల
స్టేషనరీ, బ్యాలెట్ పేపర్లు ముద్రణకు టెండర్లు
నోడల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియమాకానికి కసరత్తు
జిల్లాలో 543 పంచాయతీలు, 27 జడ్పీటీసీలు, ఎంపీపీలు, 454 ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు సన్నద్దం
(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వ డంతో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, జిల్లా పరిషత్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. రెండు రోజు ల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడు దల చేసే అవకాశాలున్నాయి. ఆపై ఎన్నికల షెడ్యూలు విడు దల కానుంది. 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా రిజర్వేషన్లు 50 శాతంకు మించరాదని రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో, కోర్టు ఆదేశాలను అనుసరించి రిజర్వేషన్లును ప్రకటించే అవ కాశాలున్నాయి.
ముందస్తు ప్రక్రియ ప్రారంభం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సర్ పూర్తికాకపోయినా పాత ఓటర్ల జాబితాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్ప టికే సుప్రీంకోర్టు అదేశాలు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ దాదాపు మొదలయినట్లే. ఇప్పటికే ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లకు సంబంధించి మండలాల్లోని ఎంపీటీసీల వారీగా, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీల వారీగా, మున్సిపాల్టీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధంగానే ఉన్నాయి. జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరగనున్నందున బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సిద్ధం చేశారు. పోలింగ్‌కు స్టేషనరీ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు ముద్రణకు సంబంధించి జడ్పీ, పంచాయతీలు టెండర్లు పిలి చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ అధికా రులు, నోడల్ అధికారులు, ఇతర అధికారులను నియమించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవా లని ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి మౌఖికంగా ఆదేశాలు రావడంతో నియామక ప్రక్రియ మొదలైంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ జాబితాలు విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
543 పంచాయతీలు, 27 జడ్పీటీసీలు, 454 ఎంపీటీసీలు
జిల్లాలో 543 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. జడ్పీకి సంబంధించి 27 జడ్పీటీసీలు, 454 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీకి సంబంధించి 1,555 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీల వారీగా పరిశీలిస్తే జిల్లాలో 12,96,519 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 6,35,768, మహిళా ఓటర్లు 6,60,708 మంది, ఇతర ఓటర్లు 43 మంది వరకు ఉన్నారు. పంచాయతీలకు సంబంధించి 543 పంచాయతీల్లో 12,96,519 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే పంచాయతీల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేయటంతో పాటు ఎన్ని కలకు సంబంఽధించి అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల రంగంలోకి దిగనున్నాయి.