Share News

లోక్‌ కల్యాణ్‌ మేళా

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:22 AM

వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేం దుకు మెప్మా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు.

లోక్‌ కల్యాణ్‌ మేళా

వీధి వ్యాపారులకు రుణాలు

రేపటి నుంచి వీధి వ్యాపారుల గుర్తింపు

1,668 మందికి రుణాల మంజూరు లక్ష్యం

మునిసిపాల్టీల వారీగా తేదీల ఖరారు

భీమవరం టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేం దుకు మెప్మా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల పరిధిలో వచ్చే నెల 1 నుంచి 30 వరకు లోక్‌ కల్యాణ్‌ మేళా నిర్వహించ నున్నారు. గుర్తించిన వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయించేందుకు మున్సిపాలిటీల వారీగా మేళా నిర్వహిస్తారు. మెప్మా గుర్తించని వీధి వ్యాపారులను కూడా పరిగణనలోకి తీసుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు.

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన వీధి వ్యాపారులు సుమారు 14 వేల మంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 వేలమంది వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించామని చెబుతున్నారు. మిగిలినవారిలో 1668 మంది వీధి వ్యాపారులకు రుణాలు అం దించడమే లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధిం చేలా చర్యలు తీసుకోనున్నారు. రుణ మేళా నిర్వహించేందుకు మునిసిపాల్టీల వారీగా తేదీలను ఖరారు చేశారు. ప్రతీ మునిసిపాల్టీలో నెలాఖరు వరకు రెండు నుంచి మూడు మేళాలు నిర్వహించే విధంగా ప్రణాళికలను రూపొందించి సంబంధిత వివరాలను మునిసిపాల్టీలలోని మెప్మా అధికారులకు సమాచారాన్ని అం దించారు. బ్యాంకులను సమన్వయం చేసుకుంటూ కేటాయించిన తేదీల్లో వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు కృషి చెయ్యనున్నారు.

ఇప్పటికే ఆరు మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యా పారులను గుర్తించి, వారిలో4,131 మందికి రూ.7.94 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందించారు. 518 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాల్సి ఉంది. వచ్చే నెలలో నిర్వహించే లోక కల్యాణ్‌ మేళాలో వీరికి రుణాలు మంజూరు చేయించేందుకు అధికారు లు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు వీధి వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు పొంది, వాటిని సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో రుణా లను సక్రమంగా చెల్లిస్తున్న వారికి బ్యాంకుల ద్వారా క్రెడిట్‌ కార్డులు కూడా అందిస్తున్నారు. మునిసిపాల్టీల వారీ గా ఇచ్చిన లక్ష్యాలు ఇలా ఉన్నాయి. ఆకివీడులో 37 మంది, భీమవరంలో 483 మంది, నరసాపురంలో 97 మంది, పాలకొల్లులో 537 మంది, తాడేపల్లిగూ డెంలో 218మంది, తణుకు మునిసిపాలిటీలో 296 మందికి రుణాలు అందించనున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:22 AM