Share News

139 దుకాణాల పునరుద్ధరణ

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:50 AM

జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్స్‌కు మిశ్రమ స్పందన లభించింది. రెన్యువల్స్‌ గడువు ముగిసిన బుధవారం నాటికి 155 మద్యం దుకాణాలకు 139 మంది లైసెన్సులను పునరుద్ధరించుకున్నారు.

139 దుకాణాల పునరుద్ధరణ

ముగిసిన మద్యం లైసెన్సుల రెన్యువల్‌ గడువు

ఆదాయం రూ.61.30 కోట్లు.. 16 దుకాణాలకు దరఖాస్తుల నిల్‌ 8 త్వరలో లాటరీతో భర్తీ

ఏలూరు,సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి):జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్స్‌కు మిశ్రమ స్పందన లభించింది. రెన్యువల్స్‌ గడువు ముగిసిన బుధవారం నాటికి 155 మద్యం దుకాణాలకు 139 మంది లైసెన్సులను పునరుద్ధరించుకున్నారు. రెన్యువల్‌ ఫీజుల కింద ప్రభుత్వానికి రూ.61.30 కోట్లు ఆదాయం జమ అయ్యింది. లైసెన్సుదారులకు ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు పునరుద్ధరణ ఉత్త ర్వులను ఎక్సైజ్‌ అధికారులు జారీ చేయనున్నారు. వాస్తవంగా ఈనెల 21వ తేదీకి రెన్యువల్‌ దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా 23 వరకు పొడిగిం చారు. చివరలో పెద్దగా దుకాణదారులు స్పందించకపోవడంతో మిగిలిన 16 దుకాణాలను త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు స్వీకరించి, లాటరీ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. ఏలూరులో ఇంకా 10 దుకాణాల లైసెన్సులు అత్యధికంగా రెన్యువల్‌ కాకుండా ఉండిపోయాయి. కైకలూరులో 4, భీమడోలు, నూజివీడులో ఒక్కో దుకాణం రెన్యువల్‌ జరగలేదు. ఈ సారి దుకాణాలకు కనీసంగా 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలని యోచి స్తున్న నేపఽథ్యంలో మిగిలిన దుకాణాలపై కొంత ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Sep 24 , 2026 | 12:50 AM