Share News

155 మద్యం దుకాణాల రెన్యువల్‌కు గెజిట్‌

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:51 AM

జిల్లాలో 155 మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌ (2026–27 సంవత్సరం)కు కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సూపరిం టెండెంట్‌ ఆనాల ఆవులయ్య తెలిపారు.

155 మద్యం దుకాణాల రెన్యువల్‌కు గెజిట్‌
గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న ఎక్సైజ్‌ సూపరింటెం డెంట్‌ ఆవులయ్య

21వ తేదీ వర కు దరఖాస్తుకు గడువు.. రూ.153.23 కోట్ల ఆదాయం అంచనా

విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆవులయ్య

ఏలూరు,సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 155 మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌ (2026–27 సంవత్సరం)కు కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సూపరిం టెండెంట్‌ ఆనాల ఆవులయ్య తెలిపారు. శాత వాహన నగర్‌లోని తన కార్యాలయంలో శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ‘జిల్లాలో 155 మద్యం దుకాణాల్లో 141 ఓపెన్‌ కేటగిరి, 14 గీత కులాలకు ప్రభుత్వం మంజూరు చేసినవి ఉన్నాయి. లైసెన్సులు ఏడా ది కాలానికి రెన్యువల్‌ చేయడం ద్వారా రూ.153.23 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమ కూరుతుంది. లైసెన్సుదారులందరూ దుకాణా లను ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంట ల్లోగా రెన్యువల్‌ చేయించుకోవాలి. లేకుంటే దానిని తిరిగి లాటరీ ద్వారా కేటాయిస్తాం. ఈ లాటరీలో ప్రతి షాపునకు తప్పనిసరిగా నాలు గు దరఖాస్తులు నమోదైతేనే లాటరీ తీసి కేటా యింపు చేస్తాం. రెన్యువల్‌ విషయంలో 118 దుకాణాలకు రూ.71.50 లక్షల చొప్పున, 23 షాపులు రూ.60.50 లక్షలు చొప్పున, గీత కార్మి కులకు కేటాయించిన వాటిల్లో 10 షాపులకు రూ.35.80 లక్షలు, నాలుగు షాపులకు రూ.30.30 లక్షల చొప్పున జనాభా ప్రాతి పాదికన కార్పొరేషన్‌, మున్సి పాల్టీలు, నగర పంచాయతీలు, మండలం వారీగా వార్షిక ఫీజు గా ప్రభుత్వం నిర్ణయించింది. రెన్యువల్‌ చేసుకోవడానికి రిటైల్‌ ఎక్సైజ్‌ ఫీజును 38 శాతం అనగా రూ.71.50 లక్షలు కలిగిన షాపునకు రూ.27.20 లక్షలు, రూ.60.50 లక్షలు కలిగిన షాపునకు రూ.23 లక్షలు, గీత కులాల షాపులకు రూ.13.60 లక్ష లు, రూ.11.50 లక్షలు చొప్పున లైసెన్సు రెన్యువ ల్‌ ఫీజులుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెన్యు వల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ఫీజు ఒకే మొత్తంగా అప్లికే షన్‌తో చెల్లించాలి. పర్మిట్‌ రూమ్‌ ప్రతిషాప్‌కు తప్పనిసరి. పర్మిట్‌రూమ్‌ ఫీజు రూ.7.50 లక్ష లు, రూ.5 లక్షలుగా నిర్ణయించగా ఒకేసారి లేదా నాలుగు వాయిదాల్లో సెప్టెంబరు, డిసెం బరు, జనవరి, మే మాసాల్లో చెల్లించవచ్చు. రెన్యువల్‌ ప్రాసెసింగ్‌ ఫీజు కింద ప్రతి లైసెన్సు దారుడు రూ.ఐదు వేలు చెల్లించాలి’ అని ఆయన వివరించారు.

Updated Date - Sep 13 , 2026 | 12:51 AM