రూ.140 కోట్లు
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:50 AM
ప్రభుత్వం ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపై దృష్టి సారించింది. లక్ష్యాలను చేరుకోవాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
మద్యం లైసెన్స్‌దార్లకు కొనుగోలు లక్ష్యం
నెలాఖరు నాటికి కొనుగోళ్లకు చర్యలు
దుకాణాల్లో నిల్వలకు సన్నద్ధం
అక్రమ మద్యంపై అధికారుల నిఘా
లైసెన్స్‌డ్ దుకాణాల్లో పెరిగిన అమ్మకాలు
ప్రభుత్వం ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపై దృష్టి సారించింది. లక్ష్యాలను చేరుకోవాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ కూడా మార్చిలో రూ.140 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మద్యం షాపులు, బార్‌లు మార్చి మాసాంతానికి లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లైసెన్స్‌దారులు డిపోల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆదాయ పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి మాసాంతానికి చెల్లించాల్సి బిల్లుల క్లియరెన్స్ చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియ రెన్స్ ఇచ్చిన బిల్లులకు పెద్ద మొత్తం సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాలను పెంచు కునే దిశగా మద్యం కొనుగోలు లక్ష్యం నిర్దేశించింది. లైసెన్స్‌దారులకు ఒకే నెలలో రూ.140 కోట్లు మద్యం కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ చేయడం భారం కానుంది. అంత మొత్తంలో అమ్మకాలు జరిగే అవకా శం లేకున్నా డిపో నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబరు నాటికి మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ప్రభుత్వం నుంచి కమీషన్‌ను పెంచే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా రు. నోటిఫికేషన్‌లో 20శాతం ఇస్తామని ప్రకటించ డంతో పోటీ పడ్డారు. తయారీ కేంద్రాల నుంచి డిపో లకు వచ్చే మద్యానికి మాత్రమే 20 శాతం కమీషన్ అంటూ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. డిపోల నుంచి తీసుకునే మద్యానికి మాత్రమే ప్రభు త్వం కమీషన్ ఇస్తోంది. కొన్నాళ్ల పాటు 10 శాతం ఇచ్చారు. ఆ తర్వాత దానిని 14శాతానికి పెంచారు. కమీషన్ తక్కువ కావడం వల్ల గిట్టుబాటు కావడం లేదని లైసెన్స్‌దారులు తొలి నుంచి గగ్గోలు పెడుతు న్నారు. మరోవైపు డిపో నుంచి మద్యాన్ని కొనుగోలు లక్ష్యాలను ఇస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. కొత్త సంవత్సరంలో అమ్మకాలు పెరిగాయి. సం క్రాంతి రోజుల్లో ఆశించిన దానికంటే విక్రయాలు పెరి గాయి. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధికంగా తరలిరావడంతో సంక్రాంతికి మద్యం అమ్మకాలు జోష్ పెంచాయి. లైసెన్స్‌దారుల్లో కాస్త ఊరట లభిం చింది. ప్రస్తుతం కొనుగోలు లక్ష్యాలను పెంచుతున్నా నిల్వ చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.
అక్రమ మద్యంపై ఉక్కుపాదం
జిల్లాలో అక్రమ మద్యంపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నకిలీ మద్యం ఆనవా ళ్లు లేకుండా చర్యలు తీసుకోవడంతో లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలు, బార్‌లలో అమ్మకాలు పెరిగా యి. బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉంది. అక్ర మ మద్యం నిల్వలను కూడా ఛేదించి కేసులు నమో దు చేశారు. నాటు సారా కూడా లేకుండా కట్టుది ట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులను అడ్డుకున్నారు. జిల్లాకు అక్ర మంగా మద్యం తరలించాలంటే పొరుగు జిల్లాలు దాటుకుని రావాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు ఉక్కుపాదం మోపడంతో అక్రమ మద్యం దిగుమతికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు. గతంలో దాబాల్లో నాన్ డ్యూటిపెయిడ్ మద్యం అమ్మకాలు సాగించే వారు. దానిని కూడా అధికారులు చెక్ పెట్టారు. ఫలి తంగా మద్యం దుకాణాల్లో అమ్మకాలు పెరుగుతు న్నాయి. మార్చిలో పెద్ద మొత్తంలో లక్ష్యాన్ని ఇవ్వడం తోనే అధికారుల్లో కూడా కాస్త టెన్షన్ నెలకొంది.