సమస్యలపై అక్షర సమరం
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:52 AM
ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
సుమారు 300 మందికి పైగా హాజరు.. సమస్యలు ఏకరవు పెట్టిన ప్రజలు
ప్రతి సమస్యను ఆలకించి.. నోట్ చేసుకున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి
కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం.. మరికొన్ని దశల వారీగా పూర్తికి హామీ
పట్టణం అభివృద్ధికి రూ.8.12 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడి
తణుకు/తణుకు రూరల్/ఇరగవరం, మార్చి 31(ఆంధ్రజ్యోతి):ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తణుకు పట్టణంలోని పైడిపర్రు చెరువు వద్ద మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. 70 మందికిపైగా తమ సమస్యలను ముఖ్య అతిథి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ప్రతి సమస్యను ఆలకించి, నోట్ చేసుకుని కొన్నిం టికి అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. మరికొన్నింటికి రానున్న రోజుల్లో పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పలువురు వృద్ధులు పింఛన్లు ఇప్పించాలని, అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న తమ వారికి వైద్యం అందించేందుకు సహకరించాలని కన్నీంటి పర్యంతమయ్యారు. వారిని ఎమ్మెల్యే ఓదార్చి భరోసా కల్పించారు. ఆ ప్రాంతంలోని డ్రెయిన్ సమస్యను తీవ్రంగా వుందని స్థానికులు చెప్పడంతో ఎమ్మెల్యే నేరుగా అక్కడకు వెళ్లి పరిశీలించి, దాని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు అక్కడికక్కడే ఆదేశించారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ బి.హరిబాబు అధ్యక్షతన జరిగిన సభలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, తహశీల్దార్ డీవీఎస్‌ఎస్ అశోక్‌వర్మ, మునిసిపల్ అధికారులు తదితరులు హాజరయ్యారు. కూటమి పార్టీల నాయకులు హాజరయ్యారు.
మా బిడ్డను కాపాడండి
‘నాలుగేళ్ల నా కుమారుడు జీవన్‌కుమార్ నడవలేని, మాట్లాడలేని స్థితిలో వున్నాడు. వైద్యులకు చూపిస్తే మెదడులో ఏర్పడిన సమ స్య కారణమని చెప్పారు. దీనికి వైద్యం చేసేం దుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవు తుందన్నారు. ఏ ఆధారం లేని మాకు ప్రభు త్వం ద్వారా సాయం చేయాలని కోరుతున్నాం. నా బిడ్డకు మెరుగైన వైద్యం అందించి కాపా డండి’ అంటూ పైడిపర్రుకు చెందిన గాదె పావని ఎమ్మెల్యే రాధాకృష్ణను కోరారు. ‘మీ బిడ్డ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి నుంచి కొటేషన్ తీసుకు వస్తే.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి సహాయం అం దించేందుకు కృషి చేస్తాం’ అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ప్రతి సమస్య పరిష్కరిస్తాం
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన నిలుస్తోంది. ఎండీ వేమూరి రాధాకృష్ణ ఎంతో ధైర్యంగా పత్రికను, చానల్‌ను నిర్వహిస్తూ ప్రజాస్వామ్యానికి అండ గా నిలుస్తున్నారు. ఈడీ వేమూరి ఆదిత్య ఆలోచ నల నుంచి వచ్చిన ‘అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా’ కార్యక్రమం బాగుంది. తణుకు సదస్సులో 70కు పైగా వచ్చిన సమస్యల్లో అత్యధి కం పింఛన్ల కోసమే వున్నాయి. త్వరలోనే నూత న పింఛన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కొందరికి వయసు వున్నప్పటికి పింఛ న్లు రావడం లేదు. అర్హులకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
గత ప్రభుత్వ హయాంలో కాపవరంలో ఇచ్చిన ఇళ్ల స్థలా లు నివాస యోగ్యం కాదు. నాడు ప్రజా ప్రతినిధులు కమీ షన్ల కోసం కక్కుర్తిపడి ఎక్కువ ధరకు స్థలాలను ప్రభుత్వంతో కొనిపించి 1300 మంది పేదలకు అంటగట్టారు. ఈ స్థలం ఆరడుగుల లోతున వుంటుంది. ఒక్కరు ఇల్లు కట్టుకోలేదు. దీనిపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సొసైటీ రోడ్డు వద్ద ఉన్న ట్యాంకు బండ్‌పై రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి విషయంలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శునకానందం పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఈ పార్కు అభి వృద్ధికి కోటి 30 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభి స్తాం. కోయాక్సిల్ రోడ్డులో సగం వరకు సీసీ రోడ్డు వేశాం. మిగిలిన రోడ్డు త్వరలోనే వేస్తాం. కప్పల వెంకన్న సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు టీడీపీ హయాంలోనే సీసీ రోడ్డు వేశాం. వైసీపీ ఏం చేయలేదు. ఇపుడు కూటమి వచ్చిన తర్వాత రైల్వేస్టేషన్ రోడ్డును కోయాక్సిల్ రోడ్డు వరకు వేశాం. తేతలి వై.జంక్షన్ నుంచి మహిళా కళాశాల వరకు సీసీ రోడ్డు నిర్మిస్తాం. ఉండ్రాజవరం ఫ్లైఓవర్ వద్ద సర్వీసు రోడ్లు నిర్మించాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22 కోట్లతో 233 పనులు పూర్తి చేశాం. ఇప్పుడు రూ.8.12 కోట్లతో 413 పనులకు నిధులు కేటాయిస్తున్నాం’ అని ఆరిమిల్లి చెప్పారు.