నిమ్మ ధర ఢమాల్
ABN , Publish Date - May 24 , 2026 | 12:21 AM
నిమ్మ ధరలు హఠాత్తుగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో 50 కేజీల బస్తా రూ.8,500 ఉండేది ప్రస్తుతం అదే బస్తా రూ.3,500కు అమాం తంగా పడిపోయింది.
కేజీ రూ.170 నుంచి రూ.70 పడిన వైనం
నిమ్మల రైతుల ఆందోళన
ఏలూరు రూరల్, మే 23(ఆంధ్రజ్యోతి) : నిమ్మ ధరలు హఠాత్తుగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో 50 కేజీల బస్తా రూ.8,500 ఉండేది ప్రస్తుతం అదే బస్తా రూ.3,500కు అమాం తంగా పడిపోయింది. ఇటీవలవరకు ఆశాజనకంగా ఉన్న ధర పడిపోవ డంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏలూరు నిమ్మకాయల మార్కెట్ నుంచి కర్ణాటక, ముంబై, బెంగళూరు, మద్రాసు ఇతర ప్రాంతాలకు ముమ్మరంగా వ్యాపారులు ఇక్కడ నుంచే ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండడంతో ఏలూరు మార్కెట్ యార్డుకు రోజుకు 20 నుంచి 30 లారీలు వస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు నిమ్మతోటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగుమతులు లేక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా రేటు ఉన్నప్పటికీ దిగుబడి తగ్గింది. మొన్నటి వరకు కేజీ రూ.170 ధర పలికి, ఇప్పుడు రూ.70కి పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్ వన్ రకం కేజీ రూ.70 పలుకుతోంది. నార్త్ ఇండియాలో వర్షాలు కురవడంతో ఆ ప్రభావం ఎగుమతులపై పడింది. ధర తగ్గిపోవడంతో నష్టాలు మూట కట్టుకోవల్సి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధర మరింత తగ్గిపోయే పరిస్ధితి ఉందని రైతులు, ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నిమ్మ రైతులను ఆదుకోవాలి
మే 10వ తేదీ దాటిన తరువాత వర్షం పడితే నిమ్మకాయల తయారీలో నాణ్యత పెరుగుతుందని, ఈ కాలంలో వర్షం కురవకపోవడంతో నిమ్మకాయల్లో నాణ్యత తగ్గే నిన్న మొన్నటి వరకు రూ.170, 120 పలికిన నిమ్మకాయల ధర అమాంతంగా రూ.70లకు పడిపో యింది. ప్రస్తుతం తీవ్ర ఎండాకాలంలో నిమ్మకాయలకు ధర ఉండాల్సిది పోయి ధర తగ్గిపోవడానికి వ్యాపారులు మాయాజాలం కనిపిస్తుంది. ప్రభుత్వం నిమ్మకాయలకు ధర పెంచి నిమ్మ రైతులను ఆదుకోవాలి.
– శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి