ఏలూరులో తూనికలు, కొలతల శాఖ దాడులు
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:18 AM
ఎంఆర్‌పీ కన్నా అధిక ధరలకు అమ్మే షాపులపై తూనికల, కొలతలశాఖ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు తూనికల, కొలతల శాఖ డిప్యూ టీ కంట్రోలర్ శివారెడ్డి తెలిపారు
అధిక ఽధరలకు విక్రయిస్తున్న 15 మందిపై కేసులు
ఏలూరు టూటౌన్, ఏప్రిల్ 13 (ఆంధ్ర జ్యోతి): ఎంఆర్‌పీ కన్నా అధిక ధరలకు అమ్మే షాపులపై తూనికల, కొలతలశాఖ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు తూనికల, కొలతల శాఖ డిప్యూ టీ కంట్రోలర్ శివారెడ్డి తెలిపారు. ‘ఇక్కడ ఎంఆర్‌పీ పాటించం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై లీగల్ మెట్రాలజీ అధికారులు స్పందించారు. ఏలూరు కొత్తబస్టాండ్‌లో, పాతబస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ఽధరలకు అమ్మేవారిపై 15 కేసులు నమోదు చేశారు. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాలు ఎంఆర్‌పీ కంటే అధికంగా అమ్ముతున్నట్టు తేలిందన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఏ వ్యాపారులైన ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేస్తామని సిటీ కంట్రోలర్ పీవీ.రంగారెడ్డి హెచ్చరించారు. దాడుల్లో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.వాసుదేవరావు పాల్గొన్నారు.